ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాజీ భార్యను హత్య చేసి...!

Published : Aug 12, 2023, 09:43 AM IST
ఇన్ స్టాగ్రామ్  లైవ్ లో మాజీ భార్యను హత్య చేసి...!

సారాంశం

ఆమెను చంపిన తర్వాత, ఆ వ్యక్తి పిస్టల్‌తో గ్రాడకాక్ వీధుల్లోకి వెళ్లి ఒక వ్యక్తిని, అతని కొడుకును కాల్చి చంపాడని న్యాయవాదులు తెలిపారు. అతను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఒక పోలీసు అధికారిని, మరొక వ్యక్తి , ఒక మహిళను కూడా గాయపరిచాడని అక్కడి అధికారులు తెలిపారు.  

ఓ వ్యక్తి   ఇన్ స్టాగ్రామ్  లైవ్ పెట్టి, తన మాజీ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత  మరో వ్యక్తిని, అతని కొడుకును కూడా కాల్చి చంపేశాడు.ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోస్నియాలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈశాన్య బోస్నియా పట్టణంలోని గ్రాడకాక్‌లో ఈ దాడి జరిగింది. ముగ్గురిని చంపేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, అక్కడి అధికారులు తెలిపారు  బోస్నియా ఇప్పటికీ మహిళలపై హింస విస్తృతంగా ఉంది, అయితే మాజీ భార్య ని హత్య చేస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆమెను చంపిన తర్వాత, ఆ వ్యక్తి పిస్టల్‌తో గ్రాడకాక్ వీధుల్లోకి వెళ్లి ఒక వ్యక్తిని, అతని కొడుకును కాల్చి చంపాడని న్యాయవాదులు తెలిపారు. అతను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఒక పోలీసు అధికారిని, మరొక వ్యక్తి , ఒక మహిళను కూడా గాయపరిచాడని అక్కడి అధికారులు తెలిపారు.

బోస్నియన్ ఫెడరేషన్ ప్రధాన మంత్రి నెర్మిన్ నిక్సిక్ మాట్లాడుతూ, "ఈ రోజు గ్రాడకాక్‌లో ఏమి జరిగిందో వివరించడానికి నా దగ్గర మాటలు లేవు. హంతకుడు చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు, కాని బాధితుల ప్రాణాలను ఎవరూ తిరిగి తీసుకురాలేరు." అని చెప్పారు.

కాల్పులకు గల కారణాలను అధికారులు వెంటనే అందించలేదు. అయితే, చనిపోయిన సదరు మహిళను అతను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నాడట. ఆ వేధింపులు తట్టుకోలేకే ఆమె అతని నుంచి దూరమైంది. అయితే, చాలా కాలం తర్వాత వచ్చి ఇలా హత్య చేయడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

కాగా, అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన లైవ్ వీడియోని 12వేల మంది చూశారట. అందులో అతను తన మాజీ భార్య నుదిటిపై తుపాకీతో కాల్చి చంపేశాడు. లైవ్ అయిపోయిన తర్వాత అతను ఆ వీడియోని డిలీట్ చేయడం గమనార్హం.

నిందితుడు35 ఏళ్ల సులేజ్‌మనోవిక్ బాడీబిల్డర్, ఫిట్‌నెస్ కోచ్ అని బోస్నియన్ మీడియా పేర్కొంది, అతను డ్రగ్స్ స్మగ్లింగ్  పోలీసు అధికారిపై దాడి చేసిన ఆరోపణలపై గతంలో అరెస్టులు చేశారు.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..