బ్రిటన్ కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్

By Nagaraju penumalaFirst Published Jul 23, 2019, 4:52 PM IST
Highlights

బోరిస్ జాన్సన్ ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరిమి హంట్‌పై తిరుగులేని ఆధిక్యత సాధించడంతో టోరీపార్టీ నేతగా ఆయన విజయం ఖాయమైంది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 

లండన్‌ : బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌  ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికల ఫలితాల్లో బోరిస్ జాన్సన్ భారీ విజయం సాధించారు. లక్షా 60 వేల కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యుల పోస్టల్‌ బ్యాలెట్లలోనూ జాన్సన్‌ తిరుగులేని ఆధిక్యత కనబరిచారు. 

బోరిస్ జాన్సన్ ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరిమి హంట్‌పై తిరుగులేని ఆధిక్యత సాధించడంతో టోరీపార్టీ నేతగా ఆయన విజయం ఖాయమైంది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే శనివారం కొందరు నిరసన కారులు 10 డౌన్‌ స్ట్రీట్‌లో ప్రదర్శన చేస్తూ నో బోరిస్‌.. యస్‌ టు యూరోప్‌ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. 

click me!