కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు: మనుషులపై ప్రయోగాలు సక్సెస్

By narsimha lode  |  First Published Jul 2, 2020, 1:39 PM IST

 ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో  జర్మనీకి చెందిన ఫార్మా సంస్థ ముందడుగు వేసింది.
 


ఫ్రాంక్‌ఫర్డ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో  జర్మనీకి చెందిన ఫార్మా సంస్థ ముందడుగు వేసింది.బయో‌ఎన్ టెక్ తో పాటు అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ కంపెనీలు సంయుక్తంగా  రూపొందించిన టీకా మెరుగైన ఫలితాలను ఇస్తోందని ఆ కంపెనీలు ప్రకటించాయి.

also read:ప్రపంచదేశాలకు షాక్: రెమిడెసివిర్ అంతా అమెరికాకే

Latest Videos

undefined

కరోనా సోకిన రోగులపై తొలిదశ ప్రయోగాల్లో వైరస్ ను తట్టుకొనే సామర్ధ్యాన్ని గుర్తించినట్టుగా ఆ కంపెనీలు ప్రకటించాయి.కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్, మోడెర్నా, కాన్సినో బయోలాజిక్స్, ఇనోవియా ఫార్మాల సరసన ఈ రెండు కంపెనీలు చేరాయి.

బయోఎన్‌టెక్ కంపెనీ bnt162b1 పేరుతో వ్యాక్సిన్ ను 24 మంది వలంటీర్లపై రెండు డోసుల్లో పరీక్షలు నిర్వహించినట్టుగా ప్రకటించింది.  వైరస్ సోకిన రోగులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తే  యాంటీబాడీస్ అభివృద్ది చెందినట్టుగా తేలిందని ఆ కంపెనీ తెలిపింది.

కరోనా సోకకుండా ఉండేందుకు గాను గతంలో కొందరిపై ప్రయోగాలు చేసింది ఈ కంపెనీ. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో స్వల్ప జ్వరం మాత్రమే వచ్చినట్టుగా తెలిపింది.

ఈ నెల చివరి వారంలో బయోఎన్ టెక్, ఫైజర్ సంస్థలు సంయుక్తంగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోని కరోనా రోగులపై ప్రయోగాలు చేయనున్నాయి. ఈ మేరకు అనుమతిని కోరాయి.

ప్రపంచంలోని పలు దేశాల్లోని 30 వేల మంది ఆరోగ్య వంతులపై ఈ ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల డోసులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

click me!