యూఎన్ఎస్ సీలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బిడెన్ మ‌ద్ద‌తు

By team teluguFirst Published Sep 22, 2022, 3:58 PM IST
Highlights

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి లో మన దేశం శాశ్వత సభ్యదేశంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఈ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు ఇస్తుందని చెప్పారు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సీ)లో భారత్ శాశ్వత సభ్య దేశంగా ఉండేందుకు అమెరికా అధ్య‌క్షుడు మ‌ద్ద‌తు తెలిపారు. మ‌న దేశంతో పాటు జపాన్, జర్మనీలు కూడా అందులో భాగ‌స్వామ్య దేశాలుగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ విష‌యాన్ని జో బిడెన్ అడ్మినిస్ట్రేటివ్ లోని ఓ అజ్ఞాత సీనియర్ అధికారి ఒకరు నివేదించారు. అదే సమయంలో ఈ విషయంలో చాలా పని చేయాల్సి ఉందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు: నా వైఖరిని ఇప్పటికే చెప్పానన్న రాహుల్

‘‘ మేము ఎప్ప‌టి నుంచో జర్మనీ, జపాన్, భారతదేశం భద్రతా మండలిలో శాశ్వత ఉండాల‌ని కోరుతున్నాం. ఇప్ప‌టికే అదే మాట‌పై నిల‌బ‌డి ఉన్నాం. ’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయ‌న తెలిపారు. కాగా.. అందుకు ముందు రోజు (బుధ‌వారం) అమెరికా అధ్యక్షుడు బిడెన్ UN జనరల్ అసెంబ్లీలో ప్ర‌సంగిస్తూ.. UN భద్రతా మండలిని సంస్కరించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని అన్నారు. ‘‘ యునైటెడ్ స్టేట్స్‌తో పాటు UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి అరుదైన,చ అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలి ’’ అని ఆయన చెప్పారు.

ముస్లిం మ‌త పెద్ద ఇమామ్ ఉమ‌ర్ అహ్మద్ ఇలియాసీని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్.. ఎందుకంటే ?

‘‘ అందుకే కౌన్సిల్ శాశ్వత దేశాల ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుంది. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత సీట్లు ఇవ్వాలని  కోరుతున్నాం ’’ అని ఆయన అన్నారు. 

కాగా.. యుఎన్ఎస్సీ లో భారతదేశం శాశ్వత సభ్యత్వం పొందకపోవడం మనకే కాదు. ఐక్యరాజ్యసమితికి కూడా మంచిది కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. శంకర్ అన్నారు. న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ రాజ్ సెంటర్ లో ప్రొఫెసర్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో జరిగిన సంభాషణలో ఆయ‌న ఈ విషయం చెప్పారు.

ఆగిన బస్సులో నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే దిమ్మతిరిగే సీన్..

ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వం పొందడానికి ఎంతకాలం పడుతుందని ప‌న‌గారియా జైశంక‌ర్ ను అడిగారు. ఈ ప్రశ్నకు విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. భారత్ శాశ్వత సభ్యత్వం పొందకపోవడం మనకే కాదు ఐక్యరాజ్యసమితిక కూడా సరికాదు అని అన్నారు. ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలని ఆయ‌న చెప్పారు. 

click me!