
US 2024 elections: గత నెల రోజులు రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిపై చర్చించేందుకు నాటో దేశాల నేతలు ఇవాళ బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్ లో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర నాటో దేశాల అధినేతలు ఈ భేటీ అయ్యారు. రష్యాపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చర్చలకు ముందు, స్టోల్టెన్‌బర్గ్ నాయకులు ఈ సంక్షోభాన్ని కలిసి పరిష్కరిస్తారని ప్రకటించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఒక తరంలో అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభంగా ఆయన అభివర్ణించారు.
ఈ తరుణంలో జోబైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై తిరిగి పోటీ చేసే అవకాశం వస్తే.. చాలా సంతోషిస్తాననీ అన్నారు. ఒకవేళ.. డొనాల్డ్ ట్రంప్ పై మళ్లీ పోటీ చేయాల్సి న అవకాశం వస్తే.. తాను చాలా అదృష్టవంతుడిని బ్రస్సెల్స్‌లో NATO, G7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన బిడెన్ విలేకరులతో అన్నారు. బిడెన్ రెండవసారి తన అవకాశాల గురించి చాలా అరుదుగా మాట్లాడతాడు. అస్సలు ట్రంప్ పోటీ చేయడని ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రధాన పోటీ దారుడుగా ఉంటే.. బిడెన్ గెలుపు సులభమేనని చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ పలు ఆరోపణలున్నాయి.
ట్రంప్ కేవలం ఒక పర్యాయం.. అధ్యక్షుడుగా చేసి.. 2020 ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు. కానీ, తానే గెలిచాననీ, తనను ఓడినట్టు ప్రకటన చేస్తున్నారని ఆ సమయంలో సంచలన ప్రకటన చేశారు. తాను వైట్‌హౌస్‌కు తిరిగి రావాలనుకుంటున్నానని ప్రకటించారు. తనను ఎన్నికల్లో కావాలనే..ఓడించారని, పోలింగ్ సరిగా నిర్వహిలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల విషయంలో గత ఏడాది జనవరి 6న జరిగిన అల్లర్లను బిడెన్ ప్రస్తావించారు.
అమెరికాలో దశాబ్దాలుగా అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడం. కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇతర అంశాలు బైడెన్ కువ్యతిరేఖంగా ఉన్నాయి. బిడెన్ పోల్స్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు డెమోక్రటిక్ పార్టీ తీవ్ర పోరాటాన్ని ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యూరోపియన్ కౌన్సిల్ తో నాటో దేశాలు, జీ7 దేశాధినేతల భేటీ తర్వాత ఉక్రెయిన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓ నిర్ణయం వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై రసాయన, అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమవుతుందన్న అంచనాల వార్తలు వస్తున్నాయి. ఈ బేటీలో రష్యా ప్రతి చర్యలను ఈ దేశాలు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉత్తర కొరియా.. క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. 2017 తర్వాత తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర వ్యవహర తీరును జపాన్ తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రపంచం ఉక్రెయిన్‌పై దృష్టి సారించిన సమయంలో కొరియా ఆయుధ కార్యక్రమం కారణంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని జపాన్ విమర్శిస్తోంది.