
Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నెలరోజులుగా భీకర పోరు జరుగుతోంది. ఈ యుద్దంలో రష్యాన్ సైన్యాలు ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై కాల్పులు, ఫిరంగి దాడులు జరుగుతున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకోవాలని పుతిన్ సేనాలు శతవిధాలుగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అక్రమణ సాధ్యపడటం లేదు. రష్యా బలాగాలను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ యుద్దంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. లక్షాలాది మంది.. ప్రాణాలను అరి చేత పెట్టుకుని సరిహద్దులు దాటారు. ఎంతో మంది క్షత్రగాత్రులైయారు. అయితే.. ఇరుదేశాల్లో ఇప్పటివరకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నెల రోజులుగా జరుగుతున్నఈ యుద్దంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (United Nations) కీలక ప్రకటన చేసింది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 1035 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. ఇందులో 90 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఈ యుద్ధంలో మరో 1650 మంది గాయపడ్డరాని వెల్లడించారు.
మరియుపోల్, కీవ్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. వీటి ప్రకారం.. మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఖర్కివ్ పరిపాలనా భవనం శిథిలాల నుంచి మరో 24 మృతదేహాలను బయటికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. ట్రాస్టియనెట్స్ నగరంలో 2 రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా మంటలు ఎగసిపడుతున్నట్లు అక్కడి గవర్నర్ తెలిపారు.
మరియుపోల్‌లో 15 వేల మంది పౌరులను రష్యా సైన్యం అక్రమంగా తమ దేశానికి తరలించినట్లు
ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ యుద్దంలో రష్యా భారీ మొత్తంలో ఫిరంగులు, మల్టీపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగానే ఎక్కువ మంది మరణించాని ఐరాస తెలిపింది. దీంతోపాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ యుద్దం వల్ల 4.3 మిలియన్ల మంది పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనీ UNICEF పేర్కొంది. అలాగే.. దాదాపు 1.8 మిలియన్లకు పైగా మంది ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోయారని యూనిసేఫ్ పేర్కొంది.
ఫాస్పరస్ బాంబుల దాడులు
ఇదిలా ఉంటే. ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ పై రష్యా రసాయన దాడులకు దిగుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. తమ పౌరులపై ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందంటూ గురువారం పేర్కొన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం ఉక్రెయిన్ పౌరులపై పాస్ఫరస్ బాంబులు దాడులు జరిగాయని. ఈ దాడి వల్ల ఎంతో మంది చిన్నారులు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను కాపాడుకోవడానికి సైనిక సహకారం కావాలని రష్యా ఎలాగైతే పరిమితులు లేకుండా మాపై అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నదో.. అలాంటి సహకారాన్ని నాటో అందించాలని కోరారు.