పాక్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్‌లో తిరుగుబాటు.. ఎందుకీ పరిస్థితి?

Published : Aug 25, 2025, 10:05 PM ISTUpdated : Aug 25, 2025, 10:16 PM IST
balochistan protest

సారాంశం

Balochistan: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ పై పదేపదే నియంత్రణ సాధించడానికి చేసిన ప్రయత్నాలు, అధికారంలో తమకు స్థానం లేదని భావించే స్థానిక సమూహాల ప్రతిఘటన ఈ ప్రాంతం కథను వివరిస్తుంది.

DID YOU KNOW ?
బలుచిస్తాన్ నిరసనలు
1948లో బలోచిస్తాన్‌ను బలవంతంగా పాక్ లో విలీనం, వన్-యూనిట్ పాలసీ, 1973లో దాని స్థానిక ప్రభుత్వాన్ని తొలగించడం వంటివి ప్రజలలో వ్యతిరేకతను పెంచాయి.

Balochistan: గత సంవత్సరం ఆగస్టు 26న నవాబ్ అక్బర్ బుగ్తీ హత్య వార్షికోత్సవం రోజున బలూచిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి హైవేలపై వరుసగా జరిగిన దాడుల్లో 70 మందికి పైగా మరణించారు. 2006లో అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆదేశించిన సైనిక ఆపరేషన్‌లో నవాబ్ అక్బర్ బుగ్తీ మరణించడంతో ఆయన బలూచ్ ప్రతిఘటనకు చిహ్నంగా మారారు. 2024లో జరిగిన రక్తపాతం ఆయన వారసత్వాన్ని కొనసాగించే ఉద్యమం ఎంత బలంగా ఉందో చూపించింది.

బలూచిస్తాన్ పై పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి నియంత్రణ సాధించాలని తీవ్ర చర్యలు తీసుకుంటోంది. వరుస ప్రయత్నాలు క్రమంలో తమకు అధికారంలో భాగం లేదని భావించే స్థానిక గ్రూపులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాయి. 1948లో కలాత్ విలీనం నుంచి 1950ల నాటి వన్-యూనిట్ పాలసీ, 1970ల భారీ-స్థాయి ఆపరేషన్ల వరకు, ఈ ప్రావిన్స్ వరుస తిరుగుబాట్లు, అణచివేతలను చూసింది. ప్రతి దశ మరింత లోతైన గాయాలను మిగిల్చింది, బలోచ్ ప్రజలు, పాక్ ప్రభుత్వం మధ్య దూరాన్ని పెంచింది. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. 

బలూచిస్తాన్ లో అదృశ్యాలు, నిర్బంధాలు, నిరసనలు

2024లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ బలూచిస్తాన్ రికార్డు ప్రకారం 830 మంది అదృశ్యమయ్యారు, 480 మంది హతమయ్యారు. అదృశ్యమైన వారిలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరుగుబాటు దాడుల తరువాతే ఎక్కువ అదృశ్యాలు జరగడం గమనించదగ్గ విషయం. ఇది ఒక నిర్దిష్ట చట్ట అమలు చర్యలా కాకుండా సామూహిక శిక్షలా కనిపిస్తుందని సంస్థ పేర్కొంది.

పాకిస్తాన్ అధికారిక కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ ఆన్ ఎన్‌ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ 2011 నుండి ఇప్పటివరకు 10,000కుపైగా కేసులు నమోదు చేసింది. అయితే, మానవ హక్కుల సంఘాలు ఈ సంఖ్యలు వాస్తవ పరిస్థితిని తగ్గించి చూపుతున్నాయనీ, అలాగే ప్రభుత్వ పాత్రను దాచిపెడుతున్నాయని వాదిస్తున్నాయి.

ప్రాణ నష్టాలు సంఖ్యలకే పరిమితం కావు. 2023 డిసెంబర్‌లో బలోచ యక్జెహ్తీ కమిటీ నేతృత్వంలో మహిళలు 1,500 కిలోమీటర్లు నిరసనలతో కాలినడకన ముందుకు సాగుతూ ఇస్లామాబాద్ చేరుకున్నారు. అదృశ్యమైన బంధువులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 2024 ప్రారంభంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాకింగ్ బాధితుల శవాలు క్వెట్టా సివిల్ హాస్పిటల్ చేరుకున్నప్పుడు కుటుంబాలు నిరసనకు దిగాయి. పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. కార్యకర్త డాక్టర్ మెహ్రాంగ్ బలోచ్ ను అరెస్టు చేశారు. గ్వాదర్ సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

పాకిస్తాన్‌ చర్యలు సమస్యను మరింతగా పెంచుతున్నాయి

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి తిరుగుబాటు గ్రూపులు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద రాష్ట్ర మౌలిక సదుపాయాలు, చైనా మద్దతు ఉన్న ప్రాజెక్టులపై దాడి చేశాయి. దీనికి ప్రతిస్పందనగా, భద్రతా చర్యలు కఠినతరం చేశారు. అయితే, ఈ కఠినమైన విధానం సమస్యను పరిష్కరించడానికి బదులుగా దూరాన్ని పెంచిందని హక్కుల పర్యవేక్షకులు వాదిస్తున్నారు.

అంతర్జాతీయ పరిశీలన పరిమితంగానే ఉంది

పాక్ చర్యలు సమస్యను పరిష్కరించడానికి బదులుగా మరింత పెంచుతున్నాయని చెబుతున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా.. అంతర్జాతీయ పర్యవేక్షణ పరిమితంగానే ఉంది. పాకిస్తాన్ 2010లో అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పందాన్ని ఆమోదించింది. అయితే, ప్రజల అదృశ్యాలపై ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితి అదృశ్యాలపై వర్కింగ్ గ్రూప్ ఇప్పటికీ పాకిస్తాన్‌ను తన నివేదికలలో ప్రస్తావిస్తుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ అభ్యాసాన్ని నిలిపివేయడంలో విఫలమైనందుకు పాక్ ను విమర్శించాయి.

తిరుగుబాటు కొనసాగడం ఒక లోతైన సమస్యను సూచిస్తుంది. దశాబ్దాల రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ అదృశ్యాలు, అణచివేత బల ప్రయోగంతో చెరిపివేయలేని ఫిర్యాదులను సృష్టించాయి. ప్రతి నిరసన, అదృశ్యమైన విద్యార్థి, బుగ్తీ వార్షికోత్సవం బలూచిస్తాన్ సంక్షోభం ఒక విధాన ఫలితం అని, యాదృచ్చికం కాదని చూపిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే