పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎదురుదెబ్బ.. అనర్హత వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఎందుకంటే ?

By team teluguFirst Published Oct 21, 2022, 4:03 PM IST
Highlights

పాక్ మాజీ ప్రధానిపై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఉద్దేశ పూర్వకంగా తన ఆస్తులను దాచి పెట్టారనే కారణంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్తులు వెల్లడించనందుకు ఆయనపై ఎన్నికల సంఘం శుక్రవారం అనర్హత వేటు వేసింది. పాలక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన చట్టసభ సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌పై గత ఆగస్టులో పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి ఈ విషయంలో ఫిర్యాదు చేశారు. ఆయన తోషాఖానా అని పిలిచే స్టేట్ స్టోర్‌ల నుండి తగ్గింపు ధరకు కొనుగోలు చేసిన బహుమతులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందారని ఆరోపించారు. అయితే వాటిని బహిర్గతం చేయడంలో విఫలమైనందుకు ఈసీ అనర్హుడిగా ప్రకటించింది. 

గురుగ్రామ్ బాణాసంచా పేలుడు ఘటనలో మరో ముగ్గురు మృతి... ఆరుకి చేరిన మరణాలు

ఇస్లామాబాద్‌లోని ఈసీపీ సెక్రటేరియట్‌లో పాకిస్థాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్‌పై తీర్పును శుక్రవారం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో ఆయన ఓడిపోయారు.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: రాహుల్ గాంధీ

 ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా.. 174 ఓట్లు రావ‌డంతో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీ..  ప్రధానమంత్రి పదవికి షరీఫ్ అభ్యర్థిత్వాన్ని సూచించింది. అత‌ని అభ్య‌ర్థ్యాన్ని ప్రతిప‌క్షాలు బ‌ల‌ప‌రచ‌డంతో 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ ఎన్నిక‌య్యారు. 

click me!