కారుపై కూలిన విమానం... ముగ్గురి మృతి

Published : Mar 17, 2021, 02:48 PM IST
కారుపై కూలిన విమానం... ముగ్గురి మృతి

సారాంశం

ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. 

కారుపై విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. కాగా..ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాగా .. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణ ఫ్లోరిడాలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. ఈ ఘటనలో తన తల్లితో కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలుడు టేలర్ బిషప్ అక్కడికక్కడే చనిపోయాడు. 

అలాగే విమానంలోని ఇద్దరు సిబ్బంది కూడా మరణించారు. బాలుడు తల్లి మేగన్ బిషప్ మాత్రం స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమెను హాలీవుడ్ మెమోరియల్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కారుపై విమానం కూలిన తర్వాత ఒక్కసారి భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే