ఇంట్లో దొంగలు పడ్డట్టు కలగన్నాడు.. చేతిలోకి గన్ తీసుకుని నిద్రలోనే కాలిని కాల్చుకున్నాడు.. ఆయనే అరెస్టయ్యాడు

Published : Jun 15, 2023, 08:45 PM IST
ఇంట్లో దొంగలు పడ్డట్టు కలగన్నాడు.. చేతిలోకి గన్ తీసుకుని నిద్రలోనే కాలిని కాల్చుకున్నాడు.. ఆయనే అరెస్టయ్యాడు

సారాంశం

అమెరికాలో ఓ వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరుగుతున్నట్టు కలగన్నాడు. దొంగలను అడ్డుకోవడానికి నిజంగానే చేతిలోకి గన్ తీసుకుని షూట్ చేశాడు. కానీ, అది కల కావడంతో బుల్లెట్ వెళ్లి తన కాలికి తగిలింది.  

న్యూఢిల్లీ: అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంతలో తన ఇంట్లోకి కొందరు దొంగలు చొరబడ్డట్టు కల వచ్చింది. సమీపంలోనే ఉన్న గన్‌ను నిద్రలోనే ఆ వ్యక్తి చేతిలోకి తీసుకున్నాడు. కలలో దొంగలకు గురి పెట్టి షూట్ చేశాడు. కానీ, ఆ బుల్లెట్ నిజంగానే పేలింది. అతని కాలిలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి నొప్పితో కెవ్వు మన్నాడు. గన్ శబ్దం వినిపించడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు స్పాట్‌కు వెళ్లారు. అయితే, తన కాలిని షూట్ చేసుకున్న ఆ వ్యక్తినే అరెస్టు చేయడం గమనార్హం.

ఈ ఘటన ఏప్రిల్ 10వ తేదీన అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో లేక్ బారింగ్టన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు స్పాట్‌కు వెళ్లగా బుల్లెట్ గాయాలతో 62 ఏళ్ల మార్క్ డికారా పడి ఉన్నాడు. వెంటనే ఆయన కాలికి ప్రథమ చికిత్స అందించినట్టు పోలీసులు తెలిపారు. గన్ ఎందుకు షూట్ చేశావని అతడిని అడగ్గా.. ఆ వ్యక్తి తాను కలలో ఉండి గన్ షూట్ చేసుకున్నానని వివరించాడు. 357 మాగ్నమ్ రివాల్వర్ తీసుకుని కలలో తన ఇంట్లోకి వచ్చిన దుండగుడిపైకి కాల్చానని, కానీ, ఆ బుల్లెట్ వాస్తవంతో తన కాలికి తగిలిందని వివరించాడు.

Also Read: కేసీఆర్, ఓవైసీల ఫ్రెండ్షిప్ వెనుక లెక్కలు ఇవే.. ముస్లిం ఓట్లతో ఆ పార్టీకి చెక్?

అతడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు. ఆ బుల్లెట్ కాలిలో నుంచి దూసుకెళ్లి మంచంలోకి చొచ్చుకెళ్లిందని వివరించారు. అదృష్టవశాత్తు అదే సన్నటి గోడను పంచుకుంటున్న పొరుగు వారి ఇంటిలోకి వెళ్లలేదని చెప్పారు. అయితే, ఆ ఇంటిలో ఎలాంటి చోరీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు అతన్ని అరెస్టు చేసుకుని తీసుకెళ్లారు. 1.5 లక్షల డాలర్ల బాండ్ పెట్టుకుని విడుదల చేశారు. ఆ వ్యక్తిపై ఆయుధ యజమాని ఐడీ సరిగా లేదని కేసు నమోదైంది. గతంలో ప్రభుత్వం ఎత్తేసిన ఐడీ ఆయన వద్ద ఉన్నదని, అది చెల్లదని పేర్కొన్నారు. జూన్ 29వ తేదీన ఆయన మళ్లీ కోర్టు ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !