ఎంత మంచి శిక్షో.... ఆస్ట్రేలియా కోర్ట్ సంచలనం

By telugu teamFirst Published Oct 6, 2019, 5:17 PM IST
Highlights

2017 డిసెంబరులో గుర్భేజ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఫ్లిండర్స్ స్ట్రీట్లో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో ఆ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్భేజ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించి శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ లో హాజరుపరిచారు. 

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన డ్రైవరుకి మెల్బోర్న్ కోర్టు వింత శిక్ష విధించంది. తన ట్యాక్సీతో గుద్ధి  ఒక వ్యక్తిని  తీవ్రంగా గాయపరిచినందుకు రెండేళ్ళ పాటు సామాజిక సేవ చేయవలసిందిగా శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. 

2017 డిసెంబరులో గుర్భేజ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఫ్లిండర్స్ స్ట్రీట్లో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో ఆ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్భేజ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించి శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ లో హాజరుపరిచారు. 

గుర్భేజ్ ట్రాఫిక్ సిగ్నల్ గమనించక పోవడం వల్లే ప్రమాదం జరిగింది అని న్యాయవాది పాల్ లకావా పేర్కొన్నారు. సామాజిక స్పృహ లేకుండా వాహన ప్రమాదానికి కారణం అయునందుకుగాను శిక్షగా రెండేళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక సేవ చేయాలని, శిక్షా కాలం ముగిసే వరకు ఎటువంటి వాహనం నడపకూడదని కోర్టు శిక్ష విధించింది.

అయితే సీసీటీవి ఫుటేజి ఆధారంగా మరియు అప్పుడు ట్యాక్సీలో ఉన్న ఇద్దరు ప్రయాణికుల వాంగ్మూలం ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో గుర్భేజ్ సింగ్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నిర్ణీత వేగంలోనే కారు నడుపుతున్నట్టు నిర్ధారించారు. 

అంతే కాకుండా గుర్భేజ్ అరెస్ట్ కి, విచారణకి పూర్తిగా సహకరించడంతో ఇతడికి జైలు శిక్ష కంటే సామాజిక సేవని శిక్షగా వేయడం ఉత్తమమని కోర్టు భావించి ఈ తీర్పునిచ్చింది.

click me!