ఆస్ట్రేలియాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్, తొలి టీకా ప్రధానికే..!!

By Siva KodatiFirst Published Feb 21, 2021, 2:33 PM IST
Highlights

ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బందీని చేయడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 

ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బందీని చేయడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. అగ్రరాజ్యాలు సహా భారత్ టీకా పంపిణీలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

దీనిలో భాగంగా ఆదివారం తొలి టీకా వేయించుకున్నారు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌. ఆ దేశ వైద్య శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తాను టీకా వేయించుకున్నట్లు వారు తెలిపారు.  

ఇక ఆస్ట్రేలియాలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విస్తృత స్థాయిలో ప్రారంభం కానుంది. అన్నిదేశాలు అనుసరించిన విధంగానే తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లయిన వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి, నర్సింగ్‌ హోంలో ఉంటున్న వృద్ధులు, సిబ్బందికి టీకా ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరి 15న 1,42,000 డోసుల ఫైజర్‌ టీకా సిడ్నిలోని విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. అయితే, ఆస్ట్రేలియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెల్‌బోర్న్‌ కేంద్రంగా ఉన్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సీఎస్‌ఎల్‌ లిమిటెడ్‌లోనే ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్నారు.

click me!