ఇండోనేషియాలో భారీ భూకంపం.. 46 మంది మృతి.. 700 మందికి గాయాలు

Published : Nov 21, 2022, 06:11 PM ISTUpdated : Nov 21, 2022, 06:24 PM IST
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 46 మంది మృతి.. 700 మందికి గాయాలు

సారాంశం

ఇండోనేషియా రాజధాని జకార్తాలో సోమవారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో 10 కి.మీ (6.21 మైళ్లు) లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాస్త్రం మరియు జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనలో  46 మంది మరణించగా.. దాదాపు 700 మంది గాయపడ్డారు. 

ఇండోనేషియాలో భూకంపం: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో   46 మంది మరణించగా.. దాదాపు 700 మంది గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. దాదాపు డజను భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

అమెరికా(US) జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతుతో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.  సియాంజూర్ జిల్లాలో ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో భూకంపం యొక్క బలమైన ప్రకంపనలు సంభవించాయి.

రాజధాని జకార్తా సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై భవనాలను ఖాళీ చేయించారు.

ఇండోనేషియా ద్వీపసమూహంలో భూకంపాలు తరచుగా సంభవిస్తాయి.కానీ జకార్తాలో వాటిని అనుభవించడం అసాధారణం. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల ఆర్క్ అయిన "రింగ్ ఆఫ్ ఫైర్" కారణంగా తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు సంభవిస్తాయి.  

ఫిబ్రవరిలో.. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపం వల్ల 25 మంది మరణించగా..460 మందికి పైగా గాయపడ్డారు. అలాగే..  జనవరి 2021లో పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. దాదాపు 6,500 మంది గాయపడ్డారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం, సునామీ కారణంగా పదికిపైగా దేశాల్లో దాదాపు 230,000 మంది మరణించారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది ఇండోనేషియాకు చెందిన వారే.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..