బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి

Published : Nov 26, 2020, 09:13 AM IST
బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి

సారాంశం

మృతదేహాలను బయటకు తీసి.. గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజులు సంతాపాన్ని ప్రకటించారు

బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. సాపాలో రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్ టైల్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను బయటకు తీసి.. గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజులు సంతాపాన్ని ప్రకటించారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ