పాకిస్తాన్ లో పేలుడు : 19 మంది పిల్లల పరిస్థితి విషమం..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 27, 2020, 11:07 AM IST
పాకిస్తాన్ లో పేలుడు : 19 మంది పిల్లల పరిస్థితి విషమం..

సారాంశం

పాకిస్తాన్, పెషావర్ లోని డిర్ కాలనీలో మంగళవారం భారీ పేలుడు జరిగిందని జియో న్యూస్ వెల్లడించింది. ఈ పేలుడులో 50మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో ఎక్కువ శాతం చిన్నపిల్లలే ఉన్నారని సమాచారం. 

పాకిస్తాన్, పెషావర్ లోని డిర్ కాలనీలో మంగళవారం భారీ పేలుడు జరిగిందని జియో న్యూస్ వెల్లడించింది. ఈ పేలుడులో 50మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో ఎక్కువ శాతం చిన్నపిల్లలే ఉన్నారని సమాచారం. 

పాకిస్తాన్ మీడియా సమాచారం ప్రకారం పెషావర్, డిర్ కాలనీలోని ఓ శిక్షణా సంస్థ  దగ్గర్లో బాంబు పేలుడు సంభవించింది. పోలీసుల సమాచారం ప్రకారం నలుగరు చనిపోగా, 19 మంది చిన్న పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. 

వీరిని వెంటనే లేడీ రీడింగ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. పిల్లలకు అయిన గాయాలు చూసి హాస్పిటల్ లోని మిగతా వారు భయబ్రాంతులకు లోనవుతున్నారని తెలిపారు. 

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నారు. అయితే ఇది ఎవరు చేశారు, ఎలా జరిగిందనే విషయాలు ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: అమెరికా సైన్యానికి వేరే దేశాల్లో ఏం పని.? ఆ దేశాలు వారిని ఎందుకు అనుమ‌తిస్తాయి.?
World Longest Train : బాబోయ్.. 7 కిలోమీటర్ల పొడవున్న రైలా? ఒకసారి చూస్తే దిమ్మతిరగాల్సిందే!