
కెనడాలో మరోసారి దుండగులు మారణహోమం సృష్టించారు. తాజాగా అక్కడ కాల్పుల కలకలం రేగింది. కెనడాలో పోలీస్ దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రఖ్స్త్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఓ మహిళా సహా 16 మంది మృతి చెందారు. పోలిసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్థానిక యంత్రాగం... ఇప్పటికే కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ లో ఉన్న ప్రజల్ని అసలే బయటకు రావొద్దని సూచించారు.
దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి కారును పోలిసుల వాహనం వలె రూపొందించాడని అధికారులు తెలిపారు. గత 30 ఏండ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారి అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చివరిసారి 1989 లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకం పై కఠిన ఆంక్షలు విధించారు. తాజాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కెనడాలో 30 ఏళ్లలో జరిగిన అతి పెద్ద ఫైరింగ్ ఘటన ఇదే కావడం గమనార్హం. చనిపోయిన వారిలో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. స్థానిక పోర్టాపిక్ రూరల్ టౌన్‌లోని ఓ ఇంటి లోపల, బయట... మృతదేహాలు పడివున్నాయి.
రాత్రి ఘటన జరగ్గా... వెంటనే అలర్టైన పోలీసులు... ఆ చుట్టుపక్కల ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఆల్రెడీ ఆ ప్రాంతం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటం వల్ల ఎవరూ బయటకు రాలేదు.