రష్యాలో ఘోర ప్రమాదం: 11 మంది సజీవ దహనం

Published : Dec 15, 2020, 06:26 PM IST
రష్యాలో ఘోర ప్రమాదం: 11 మంది సజీవ దహనం

సారాంశం

రష్యాలోని బష్కోర్టోస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు.  మంగళవారం నాడు  తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.  

మాస్కో: రష్యాలోని బష్కోర్టోస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు.  మంగళవారం నాడు  తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.

బష్కోర్టోస్థాన్‌లోని ఇషుబుల్డినో గ్రామంలోని ప్రైవేట్ రిటైర్మెంట్ హోంలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  ప్రమాద సమయంలో ఈ భవనంలో 15 మంది వృద్ధులున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు బయటపడ్డారు. 11 మంది ఈ అగ్నికి సజీవ దహనమయ్యారు.  అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు  సంఘటన స్థలానికి చేరుకొని  మంటలను ఆర్పాయి.

ఈ భవనంలో  అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పురాతన భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడంతోనే  ఈ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు
స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో