అమెరికాలో కాల్పుల బీభత్సం...11మంది మృతి

By telugu teamFirst Published Jun 1, 2019, 7:50 AM IST
Highlights

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ నగరంలో ప్రభుత్వ కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణా రాహితంగా కాల్పులు జరిపాడు. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ నగరంలో ప్రభుత్వ కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణా రాహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.

ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. అదే ప్రభుత్వ భవనంలో అతడు పనిచేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడొక్కడే ఈ కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. కాల్పులకు తెగబడ్డానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

click me!