Syria: సిరియాలో సైనిక కళాశాలపై డ్రోన్ దాడి, 100 మందికి పైగా మృతి..

By Rajesh Karampoori  |  First Published Oct 6, 2023, 4:10 AM IST

Drone Attack In Syria: సిరియాలో విషాదం చోటుచేసుకుంది. హోమ్స్ నగరంలోని సైనిక కళాశాల స్నాతకోత్సవ వేడుకపై గురువారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికిపైగా మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే ఈ దాడికి పాల్పడ్డారని సిరియా సైన్యం ఆరోపించింది. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు.


Drone Attack In Syria: యుద్ధంతో అతలాకుతలమైన సిరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హోమ్స్ నగరంలోని మిలిటరీ అకాడమీపై గురువారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 100 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. సిరియా రక్షణ మంత్రి మిలిటరీ వేడుక నుంచి వెళ్లిన కొద్ది నిమిషాలకే డ్రోన్లు బాంబులు వేయడం ప్రారంభించాయని చెబుతున్నారు. సిరియా సైనిక లక్ష్యాలపై ఇప్పటివరకు జరిగిన అత్యంత రక్తపాత దాడిగా ఇది పరిగణించబడుతుంది. సిరియా గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది.
 

ఈ దాడిలో పదుల సంఖ్యలో సైనికులు పౌరులు ఇద్దరూ మరణించినట్లు సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఏ బృందం ఈ దాడికి పాల్పడిందనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ దాడికి పూర్తి స్థాయిలో బదులిస్తామని ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సెంట్రల్ సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్‌లో ఉన్న మిలటరీ అకాడమీపై జరిగిన బాంబు దాడిని ఉగ్రవాద దాడిగా సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. అదే సమయంలో ఉగ్రవాదులు ఆక్రమించిన ఇడ్లిబ్ ప్రాంతంలో సిరియా ప్రభుత్వ బలగాలు రోజంతా భారీ బాంబులతో దాడులు చేస్తున్నాయి.

Latest Videos

undefined

ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. వేడుక ముగిసే క్రమంలో దాడి జరిగిందనని తెలిపాడు. బాంబు దాడి అనంతరం నేలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. ఇంతలో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫుటేజ్‌లో చాలా మంది రక్తంతో తడిసి పడి ఉన్నారు. కాగా కొన్ని మృతదేహాలు కాలిపోతున్నాయి. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించారని, 125 మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.  

అదే సమయంలో, అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు గురువారం నాటో మిత్రదేశమైన టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేశాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ డ్రోన్ సిరియాలోని అమెరికన్ దళాలకు సంభావ్య ముప్పుగా పరిగణించబడింది.

click me!