ఫ్రాన్స్‌ ప్రధానిగా ‘‘గే’’ .. 34 ఏళ్లకే అత్యున్నత పదవి, ఎవరీ గాబ్రియల్ అట్టల్..?

By Siva Kodati  |  First Published Jan 9, 2024, 6:45 PM IST

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన కేబినెట్‌లోని విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను (34) తన కొత్త ప్రధానిగా నియమించారు. రెండవసారి అధ్యక్షుడిగా గెలవడం, వచ్చే యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీ అవకాశాలను పెంచడం లక్ష్యంగా మాక్రాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన కేబినెట్‌లోని విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను (34) తన కొత్త ప్రధానిగా నియమించారు. రెండవసారి అధ్యక్షుడిగా గెలవడం, వచ్చే యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీ అవకాశాలను పెంచడం లక్ష్యంగా మాక్రాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గాబ్రియేల్ నియామకం రాజకీయంగా పెనుమార్పులు సూచించకపోయినప్పటికీ.. గతేడాది జనాదరణ పొందని సంస్కరణలు , జూన్ ఈయూ బ్యాలెట్‌లో తన పార్టీ ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి మాక్రాన్ సంకల్పాన్ని ఇది నొక్కి చెబుతుంది. 

పదవీ విరమణ చేసిన ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియేల్‌ను నియమించారు. కోవిడ్ 19 సంక్షోభ సమయంలో గాబ్రియేల్ కీలక పాత్ర పోషించారు. మాక్రాన్‌కు అత్యంత సన్నిహితుడిగా, మంచి వాగ్థాటి, రాజకీయ చతురత వున్న నేతగానూ గాబ్రియేల్‌కు పేరుంది. అంతేకాదు.. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన తొలి ప్రధానిగా, ఆ పదవిని అధిష్టించిన తొలి స్వలింగ సంపర్కుడిగా గాబ్రియేల్ చరిత్ర సృష్టించనున్నారు. 1987లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ చేత నియమితులైన సోషలిస్ట్ లారెంట్ ఫాబియస్ (37)పై ఇప్పటి వరకు అత్యంత పిన్న వయసు ప్రధాని. 

Latest Videos

undefined

మాక్రాన్ గ్రూప్‌కు.. మెరైన్ లే పెన్ పార్టీకి మధ్య గణనీయమైన అంతరాన్ని సూచించిన ఓపీనియన్ పోల్ సేకరణతో విభిన్న నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా ఆటుపోట్లను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది వివాదాస్పద పెన్షన్, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలపై మాక్రాన్ విమర్శలను ఎదుర్కొన్నారు. ఇది ఆయన అప్రూవల్ రేటింగ్‌లలో క్షీణతకు కారణమైంది. జూన్‌లో ఈయూ పార్లమెంట్ ఎన్నికలు.. మాక్రాన్ రాజకీయ ప్రాబల్యం ఊపందుకోవడానికి ఉపయోగపడనున్నాయి. విశ్లేషకులు 2017లో అట్టల్ , మాక్రాన్‌ల మధ్య సమాంతరాలను చూపారు. ఫ్రెంచ్ ప్రజలలో అట్టల్ స్పష్టత, అధికారం, ప్రజాదరణను నొక్కి చెప్పారు. 

మీడియా , పార్లమెంటరీ వ్యవహారాలను నావిగేట్ చేయడంలో అట్టల్‌ది అందెవేసిన చేయి. ఈ ట్రాక్ రికార్డ్ ఆయనను మాక్రాన్ కేబినెట్‌లో ప్రముఖుడిగా చేసింది. అట్టల్ ప్రధాని కావడం వల్ల ప్రభుత్వానికి మద్ధతుదారులను పెరుగుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అట్టల్ దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ఒకరిగా ప్రశంసించబడినప్పటికీ.. సోషలిస్ట్ పార్టీ నాయకులు ఒలివర్ ఫౌర్ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానికి పాలనలో ప్రమేయం లేకుండా మాక్రాన్ ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తన ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్‌ను నియమించడం ఒక మార్పుగా ఫ్రెంచ్ ఓటర్లు భావిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అలాగే స్వలింగ సంపర్క వర్గం కూడా ఈ నిర్ణయంతో సంతృప్తి చెందుతారని చెబుతున్నారు. మాక్రాన్ - అట్టల్ ద్వయం నాయకత్వంలో యూరోపియన్ యూనియన్ వేదికపై ఫ్రాన్స్ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. 

click me!