భారత్ మాకు ‘కాల్ 911’ వంటిది.. నమ్మకమైన మిత్రదేశం - మల్దీవుల మాజీ మంత్రి

Published : Jan 09, 2024, 01:22 PM ISTUpdated : Jan 09, 2024, 01:24 PM IST
భారత్ మాకు ‘కాల్ 911’ వంటిది.. నమ్మకమైన మిత్రదేశం - మల్దీవుల మాజీ మంత్రి

సారాంశం

India -  Maldives row : మల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ దేశ మాజీ రక్షణ మంత్రి భారత్ కు మద్దతు తెలిపారు. మల్దీవుల ప్రభుత్వం చైనా ప్రభావానికి లోనవుతుందని విమర్శించారు. 

India -  Maldives row : ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై మన దేశంతో పాటు ఆ దేశంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ముగ్గురు మంత్రులపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. తాజాగా ఆ దేశ మాజీ  రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ అక్కడి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. భారతదేశం మాల్దీవులకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు.

అరవింద్ ‌కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ

ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వ ‘‘హ్రస్వ దృష్టిని’’ చూపుతోందని అన్నారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశంగా ఉందన్నారు. ప్రస్తుత మల్దీవుల ప్రభుత్వం చైనా ప్రభావ జోన్ లో ఉందని, దాని వాస్తవికతను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

మాల్దీవులకు భారతదేశం ‘‘911 కాల్’’ (చాలా దేశాల్లో ఈ నెంబర్ ను ఎమర్జెన్సీ కోసం ఉపయోగిస్తారు) వంటిదని అన్నారు. ఆ దేశం అత్యవసర సమయాల్లో ఎప్పుడూ మన దేశాన్ని రక్షిస్తుందని తెలిపారు. తమది అందరితో స్నేహంగా ఉండే చిన్నదేశమని అన్నారు. భారత్ తో సరిహద్దులు పంచుకుంటున్నామని, దానిని కాదనలేమని అన్నారు. ఆ దేశం తమకు భద్రత ఇస్తుందని, సహాయం చేస్తుందని తెలిపారు. రక్షణ రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తమకు పరికరాలను అందిస్తుందని, తమని మరింత స్వావలంబనగా మార్చడానికి ప్రయత్నిస్తోందని అహ్మద్ దీదీ చెప్పారు.

ఉరీ దాడిలో ఐఎస్‌ఐ పాత్ర.. పాకిస్థాన్‌ను హెచ్చరించిన అమెరికా : యాంగర్ మేనేజ్‌మెంట్ లో బిసారియా సంచలనం..

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తమ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని మాల్దీవుల ప్రభుత్వం మాలేలోని భారత హైకమిషనర్ మును మహావర్‌కు తెలిపింది. గత వారం లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీపై ముగ్గురు కేబినెట్ మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో మాల్దీవులు విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బాయ్‌కాట్ మాల్దీవులు అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండటంతో చాలా మంది మాల్దీవులకు వెళ్లాలని చేసుకున్న ప్లాన్ లను రద్దు చేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే