జపాన్ లో మళ్లీ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు..

By Sairam Indur  |  First Published Jan 9, 2024, 4:26 PM IST

Japan earthquake : జపాన్ లో మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదు అయ్యింది. అయితే సునామీ హెచ్చరిక ఇంకా జారీ చేయలేదని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. 


Japan earthquake : ఇప్పటికే వరుస భూ ప్రకంపనలతో తీవ్ర అతలాకుతలమైన జపాన్ లో మళ్లీ భారీ భూకంపం వచ్చింది. మంగళవారం ఆ దేశం భూమి ఒక్క సారిగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు అయ్యిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇంకా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొంది. ఆదివారం ఉదయం  కూడాహోన్షు వెస్ట్ కోస్ట్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని జీఎఫ్జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.

భారత్ మాకు ‘కాల్ 911’ వంటిది.. నమ్మకమైన మిత్రదేశం - మల్దీవుల మాజీ మంత్రి

Latest Videos

undefined

జనవరి 1వ తేదీన జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ భూకంపం వల్ల సంభవించిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య 200 దాటిందని, ఇంకా 100 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ రోజున 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ద్వీపకల్పంలో భవనాలు ధ్వంసమయ్యాయి. మంటలు కూడా చెలరేగాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

(日本の地震リスク)1月9日と1月10日 - https://t.co/nuyiVdM4FW pic.twitter.com/cMsDAa61QY

— Japan Earthquakes (@earthquakejapan)

జనవరి 2 మంగళవారం కూడా ఆ దేశంలో 150కి పైగా భూప్రకంపనలు వచ్చాయి. వీటి వల్ల నిగటా, టోయామా, ఫుకుయి, గిఫు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, కార్యాలయాలు, మాల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ప్రకంపనల వల్ల జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంప వల్ల సంభవించిన నష్టంపై ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని కాలానికి వ్యతిరేకంగా పోరాటం"గా అభివర్ణించారు.

కేఏ పాల్ కు జగన్ నివాసం వద్ద చేదు అనుభవం.. శపిస్తానన్న ప్రజా శాంతి పార్టీ చీఫ్..

వరుసగా వస్తున్న భూకంపాలపై ఆ దేశ ప్రధాని పుమియో కిషిడా మాట్లాడుతూ.. నూతన సంవత్సరం రోజున సంభవించిన భూకంపం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సహాయక చర్యలకు మంచు తుఫాను ఆటంకం కలిగించిందని అన్నారు. పునర్నిర్మాణ ప్రయత్నాల కోసం తమ ప్రభుత్వం 4.74 బిలియన్ యెన్ల (32.77 మిలియన్ డాలర్లు) బడ్జెట్ నిల్వలను ఉపయోగించుకుంటుందని తెలిపారు. 

click me!