ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిఖ్ కొడుకు అసిమ్ మృతి.. గన్‌తో కాల్చుకుని బలవనర్మణం..?

By Sumanth Kanukula  |  First Published Oct 30, 2023, 9:25 AM IST

ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిఖ్ జమీల్ కుమారుడు అసిమ్ జమీల్ మృతిచెందారు. అసిమ్ జమీల్ పాకిస్తాన్‌ పంజాబ్‌ రిజీయన్‌లోని తలంబాలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.


ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిఖ్ జమీల్ కుమారుడు అసిమ్ జమీల్ మృతిచెందారు. అసిమ్ జమీల్ పాకిస్తాన్‌ పంజాబ్‌ రిజీయన్‌లోని తలంబాలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మౌలానా తారిఖ్ జమీల్ తన కుమారుడి మరణాన్ని  ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధ్రువీకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా తెలిపారు.  ‘‘ఈ విచారకరమైన సందర్భంలో మీ ప్రార్థనలలో మమ్మల్ని గుర్తుంచుకోవాలని మీ అందరినీ కోరుతున్నాము. అల్లా నా కొడుకుకు స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించుగాక’’ అని తారిఖ్ జమీల్ పేర్కొన్నారు.

మియాన్ చన్ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ సలీమ్ డాన్‌ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘అసిమ్ జమీల్‌ను తలంబ గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని ఆరోగ్య కేంద్రం నుంచి కుటుంబీకుల ఇంటికి తరలిస్తున్నారు’’ అని చెప్పారు. అయితే అసిమ్ జమీల్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Latest Videos

అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో.. అసిమ్ జమీల్ మరణానికి కారణం తుపాకీ కాల్పులు అనే విధంగా పేర్కొన్నారు. ముల్తాన్ ప్రాంతీయ పోలీసు అధికారి సోహైల్ చౌదరి డాన్.కామ్‌తో మాట్లాడుతూ.. అసిమ్ తన ఇంటిలోని వ్యాయామశాలలో తనను తాను ఛాతీపై కాల్చుకున్నాడని చెప్పారు. కుటుంబం ప్రకారం.. అసిమ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.  పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తాము ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఫుటేజీని పంపుతున్నామనిపేర్కొన్నారు. ఇక, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ రాజా పర్వైజ్ అష్రఫ్.. అసిమ్ జమీల్ కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని,సంఘీభావాన్ని తెలియజేశారు. 

click me!