మోడీతో అనుబంధం మరువలేనిది.. గుర్తు చేసుకున్న ఇవాంకా ట్రంప్..

By AN TeluguFirst Published Dec 2, 2020, 10:46 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరిలో వైట్‌హౌస్ ను వీడబోతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ భారత్ తో, ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరిలో వైట్‌హౌస్ ను వీడబోతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ భారత్ తో, ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

భారత్ - అమెరికా స్నేహం ఇక ముందు మరింత ముఖ్యమైనది కాబోతోందని అన్నారు. ప్రపంచ భద్రత, ఆర్థిక శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో ఈ బలమైన స్నేహబంధం మరింతగా పనిచేయాలని కోరుకుంది. 

39 ఏళ్ల ఇవాంకా అధ్యక్షుడు ట్రంప్ కూతురిగా, ఆయన సీనియర్ సలహాదారుగా ఇవాంక ప్రత్యేకమైన ముద్ర వేసింది. 2017లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు అమెరికా ప్రతినిధి బృందానికి ఆమె నాయకత్వం వహించారు. అప్పటి అనుభవాలను నరేంద్రమోడీతో అనుబంధాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకన్నారు. 

ప్రపంచ భద్రత, స్థిరత్వం మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో భారత-యుఎస్ స్నేహం బలంగా ఉంది. ఇప్పుడు ఈ బంధం గతంలో కంటే చాలా ముఖ్యమైనది అని ఇవాంకా అన్నారు.

"ప్రధాని నరేంద్ర మోడీతో భారతదేశంలో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. యావత్ ప్రపంచం COVID-19 తో పోరాడుతున్న నేపధ్యంలో ప్రపంచ భద్రత, స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో మన దేశాలమధ్య ఉన్న స్నేహం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనది" అని ఆమె ట్వీట్ చేసింది.

దీనికి సంబంధించి పిఎం మోడీతో ఉన్న ఫొటోలతో సహా నాలుగు చిత్రాలను ఇవాంకా పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఇవాంకా.. ట్రంప్ కుటుంబంలోని ఇతర సభ్యులకు భారత్ మీద ప్రత్యేక ప్రేమ, ఆప్యాయతలున్నాయి.

అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీల మధ్య బలమైన సంబంధాలున్నాయని, వివిధ వేదికల మీద ఇది తరచుగా దర్శనమించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ చివరిసారిగా ఫిబ్రవరిలో  భారత పర్యటన చేశారు. అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీతో చారిత్రాత్మక ర్యాలీలో ప్రసంగించారు. ఈ పర్యటనలో ఇవాంకా అధ్యక్షుడితో కలిసి వచ్చారు.
 

click me!