మెడ చూస్తే ఆగలేడు.. నులమకుండా ఉండలేడు.. 93 మందిని చంపిన సీరియల్ కిల్లర్...

By AN TeluguFirst Published Dec 1, 2020, 3:15 PM IST
Highlights

ముప్పైఏళ్లలో 93మందిని గొంతునులిమి చంపాడో సైకో. ఒంటరి మహిళలు, డ్రగ్‌ బానిసలు, సెక్స్‌ వర్కర్లే అతని టార్గెట్.  30 ఏళ్లలో 19 రాష్ట్రాల్లో 90కి పైగా హత్యలు చేశాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌ అతను. అతని పేరు సామ్యూల్‌ లిటిల్‌.

ముప్పైఏళ్లలో 93మందిని గొంతునులిమి చంపాడో సైకో. ఒంటరి మహిళలు, డ్రగ్‌ బానిసలు, సెక్స్‌ వర్కర్లే అతని టార్గెట్.  30 ఏళ్లలో 19 రాష్ట్రాల్లో 90కి పైగా హత్యలు చేశాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌ అతను. అతని పేరు సామ్యూల్‌ లిటిల్‌.

30యేళ్ల వయసులో మొదలుపెట్టిన ఈ హత్యాకాండ 74 యేళ్లకు ఆగింది. అదీ జైలులో ఉండడం వల్ల. సామ్యూల్ 1970లో మొదటి సారి తన 30 ఏళ్ల వయసులో 33 యేళ్ల మేరీని చంపాడు. మేరీ తర్వాత సుమారు 93 మంది మహిళలను అలాగే చంపేశాడు సామ్యూల్‌. అందులో ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా ఉంది. 

ముప్పై ఏళ్లలో 19 రాష్ట్రాల్లో అతడు అనేక ఘాతుకాలకు పాల్పడ్డాడు. అయితే ఒక్కచోట కూడా తన వేలిముద్రలు గానీ, ఇతర సాక్ష్యాధారాలేవీ చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. డ్రగ్‌ బానిసలు, సెక్స్‌ వర్కర్లు, ఒంటరి మహిళలే అతడి లక్ష్యం. ఎవరూ లేని అనాథలు, అందునా నల్లజాతి మహిళలైతే మరీ మంచిది. ఎందుకంటే వారిని ఏం చేసినా అడిగే వారు ఎవరూ ఉండరనే ధైర్యం అతడిది. 

ఇక హత్యలతో పాటు చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేసే సామ్యూల్‌ అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. అలా ఒక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్‌ఏ టెస్ట్ తో నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్‌ కేసుకు సంబంధించిన వివరాలు ఇటీవల బయటకు వచ్చాయి. దక్షిణ అట్లాంటాకు సుమారు 100 మైళ్ల దూరంలోని జార్జియాలో 1940, జూన్‌ 7న సామ్యూల్‌ లిటిల్‌ జన్మించాడు. తల్లి టీనేజర్‌ కావడంతో పుట్టగానే, బంధువుల ఇళ్లలో వదిలివెళ్లింది. అప్పటి నుంచి సామ్యూల్‌కు ఒంటరితనం అలవాటైంది. 

ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఓ టీచర్‌ తన మెడను రుద్దుకున్నపుడు గమనించిన అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలనే కోరిక పుట్టిందట. అప్పటి నుంచి తన పక్కనే ఉన్న సహ విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలం అయినట్లు సామ్యూల్‌ వెల్లడించాడు.

ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘గతంలో నాకు మజా దొరికిన ప్రదేశాలకు వెళ్లి మళ్లీ మళ్లీ అదే తరహాలో హత్య చేయాలని ఉండేది. ఎన్నిపళ్లు కోసుకుని తింటే అంత మజా కదా. దానిని వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. శ్వేతజాతి టీనేజర్‌ను నేనెప్పుడూ వేధించలేదు. ఎవరూ లేని వాళ్లే నా టార్గెట్‌’’ అని పేర్కొన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సున్న సామ్యూల్‌, 2005లో చివరిసారిగా టుపెలోలో హత్య చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిపింది. 

వీరిలో చాలా మంది మృతదేహాల్లో కొకైన్‌ వంటి మత్తుపదార్థాల నమూనాలు లభించడం గమనార్హం. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక ఇప్పుడు సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు ఒప్పిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ సామ్యూల్‌ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి ఈ వయస్సులో కూడా పూసగుచ్చినట్లు వివరించడం ఆశ్చర్యం. 

click me!