Mexico| పోలీసుల కాన్వాయ్ పై సాయుధ దాడి.. 13 మంది పోలీసులు సహా 17 మృతి !

By Rajesh Karampoori  |  First Published Oct 24, 2023, 7:27 AM IST

Mexico| అమెరికాలోని మెక్సికోలో సోమ‌వారం దారుణం జ‌రిగింది. పోలీసులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ సాయుధ దాడుల్లో 13 మంది పోలీసు అధికారులు సహా కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Mexico| అమెరికాలోని మెక్సికోలో దారుణం జ‌రిగింది.  గుర్తుతెలియని సాయుధ దుండగులు పోలీసుల కాన్వాయ్ పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది పోలీసు అధికారులు సహా కనీసం 17 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ రాష్ట్రమైన గెరెరోలోని కొయుకా డి బెనిటెజ్ మునిసిపాలిటీలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ ఘటనపై  అలెజాండ్రో హెర్నాండెజ్ అనే అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం..13 మంది కార్పొరేషన్ పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఫలితంగా వారు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హత్యాకాండకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దాడి జరిగినప్పుడు కాన్వాయ్‌లో సీనియర్ రాష్ట్ర భద్రతా అధికారి ప్రయాణిస్తున్నారని, పోలీసు అంగరక్షకులతో కలిసి హత్య చేసినట్లు మీడియా నివేదికలను ధృవీకరించకుండా అధికారులు తెలిపారు.

Latest Videos

మెక్సికో డ్రగ్స్ కేసులతో  అల్లాడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం 2006లో సైన్యాన్ని మోహరించింది. అయితే..సైన్యం మోహరించినప్పటి నుండి, 420,000 కంటే ఎక్కువ మంది ప్రజలు చంపబడ్డారు. మాదక ద్రవ్యాల రవాణాదారులు,భద్రతా దళాల మధ్య ఘర్షణ కారణంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో గెరెరో ఒకటిగా మారింది.
 

click me!