యవ్వనంగా కనిపించాలని.. ఏకంగా కొడుకు రక్తాన్ని...!

Published : May 23, 2023, 12:20 PM IST
యవ్వనంగా కనిపించాలని.. ఏకంగా కొడుకు రక్తాన్ని...!

సారాంశం

తాజాగా తనకు అవసరమయ్యే రక్తం కోసం తన 18ఏళ్ల కుమారుడిని వాడుకోవడం మొదలుపెట్టాడు.  


యవ్వనంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఇలా ఎవరికి తోచింది వారు చేస్తారు. కానీ ఓ వ్యక్తి తాను యవ్వనంగా కనిపించేందుకు సంవత్సరానికి దాదాపు 2మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాడు.  నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. అతను తనను తాను యవ్వనంగా చూసుకోవాలని అనుకుంటున్నాడు. 45ఏళ్ల వయసులో ఉన్న అతను ప్రస్తుతం తనను తాను 18ఏళ్ల యువకుడిగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.

తన శరీరంలోని ప్రతి అవయవం 18ఏళ్ల యువకుడికి ఎలా పనిచేస్తుందో అలానే పనిచేయాలని అని అనుకుంటున్నాడు. తాను ఎప్పటికీ ఆ 18ఏళ్ల కుర్రాడిలానే కనిపించాలి అనేది అతని తాపత్రయం. దాని కోసం ఆయన చేస్తున్న పనులు అన్నీ, ఇన్నీకావు. లక్షలు ఖర్చు పెడుతున్నాడు. తాజాగా తనకు అవసరమయ్యే రక్తం కోసం తన 18ఏళ్ల కుమారుడిని వాడుకోవడం మొదలుపెట్టాడు.

 

జాన్సన్  కి ప్రస్తుతం 45ఏళ్లు. కాగా. తన శరీరంలో గుండె పనితీరు, ఇతర అవయవాల పనితీరు సహా, తన లుక్స్, తన పురుషాంగం ఇలా ప్రతిదీ 18ఏళ్ల కుర్రాడి మాదిరిగా ఉండాలి. దానికోసం ఆయన చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్నాడు. అందుకోసం తనకు రక్త మార్పిడి అవసరమౌతూ ఉంటుంది. చాలా కాలం పాటు వేరే వ్యక్తి రక్తం వాడుకునేవాడట. తాజాగా తన కొడుకు రక్తం తీసుకోవడం మొదలుపెట్టాడట.

ఆ సేకరించిన రక్తాన్ని కూడా కొన్ని భాగాలుగా విడగొడతారట. ఆ తర్వాత ద్రవ ప్లాస్మా, మరొకటి ఎరుపు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు గా విడగొడతారట. ఆ తర్వాత ప్లాస్మాని జాన్సన్ సరిల్లోకి ఎక్కిస్తసారట. తనకు బ్లడ్ బాయ్ గా ఉండేందుకు తన కుమారుడు టాల్మేజ్ ఆనందంగా ఒప్పుకున్నాడని అతను చెప్పడం విశేషం. దాదాపు 30మంది వైద్యులు ప్రతి నిమిషం అతనికి చికిత్స అందించడానికి అందుబాటులో ఉంటారట. ఏది ఏమైనా ప్రకృతి విరుద్ధంగా అతను చేస్తున్న ప్రయత్నం అందరినీ షాకింగ్ కి గురి చేస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !