Gaddam Meghana: తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం.. న్యూజిలాండ్‌లో పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక

By Rajesh KFirst Published Jan 16, 2022, 1:01 PM IST
Highlights

Gaddam Meghana:  న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన (18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది.

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లా టంగుటూర్ కు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. తాజాగా నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా..  'సేవా కార్యక్రమాలు, యువత' విభాగంలో ప్రాతినిధ్యం వ‌హించ‌డానికి పార్ల‌మెంట్ స‌భ్యురాలుగా మేఘ‌న 
ఎన్నిక అయ్యారు. 

ఆమెను వాల్కటో ప్రాంతానికి గానూ ఆమెను నామినేట్ చేశారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లోనే స్థిరపడ్డారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001 లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్లో నివ‌సిస్తోన్నారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు. ఆమె కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. మేఘ‌న న్యూజిలాండ్ కు వలస వచ్చిన ఇత‌ర‌ దేశాల శరణార్థులకు కనీస వసతులు, విద్య , ఆశ్రయం కల్పించి త‌న పెద్ద మ‌న‌స్సు చాటుకుంది. వారికి స‌హాయం చేయ‌డంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తోటి స్నేహితులతో ఇక స్కూల్ డేస్ నుంచే మేఘన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు.

త‌న స్నేహితుల‌తో కలిసి విరాళాలు సేక‌రించి.. అనాథ శణాలయాలకు అందజేస్తున్నారు. న్యూజిలాండ్ కు వ‌ల‌స వ‌చ్చిన ఇత‌ర దేశాల శ‌ర‌ణార్థుల‌కు  విద్య, ఆశ్రయం, ఇతర వసతులున కల్పించడంతో మేఘన ఎంతో సేవాభావం ప్ర‌క‌టించేంది. దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఆమెను న్యూజిలాండ్ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 16న జరిగిన ఈ పార్లమెంట్‌ సభ్యురాలి ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్‌ నాన్‌ డమోలెస్‌ మేఘన కుటుంబానికి తెలిపారు. మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

యూత్ పార్లమెంట్ 2022లో పాల్గొనేందుకు ఎంపికైన యూత్ పార్లమెంట్ యూత్ సభ్యులు (ఎంపీలు), యూత్ క్లర్క్, యూత్ ప్రెస్ గ్యాలరీ సభ్యులను యూత్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఈరోజు ప్రకటించారు. యూత్ పార్లమెంట్ స‌భ్యుడి ప‌దవికాలం ఆరు నెలలు. ఎంపికైన ప్రతి ఎంపీ తన కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇందులో చురుకుగా స‌మాజ సేవ చేసే యువకులను ఎన్నుకుంటారు. వారి గొంతు వినిపించ‌డానికి  అనుమతిస్తుంది.

click me!