మెస్సీ ముఖంతో హెయిర్ కట్.... నెట్టింట వీడియో వైరల్...!

Published : Dec 19, 2022, 09:27 AM IST
మెస్సీ ముఖంతో హెయిర్ కట్.... నెట్టింట వీడియో వైరల్...!

సారాంశం

 ఏకంగా మెస్సీ ముఖంతో హెయిర్ కట్ చేయించుకున్నాడు. అతను చూపించిన అభిమానానికి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని ఆనంద్ మహీంద్రా స్పెషల్ గా షేర్ చేయడం గమనార్హం.


ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. పిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా విజయం సాధించింది. ఈ విజయంతో మెస్సీ పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ విన్నా.. మెస్సీ పేరే. ఆయన ఆట తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు.  ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా.... మెస్సీ ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా... మెస్సీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో.... ఓ వ్యక్తి మెస్సీ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా మెస్సీ ముఖంతో హెయిర్ కట్ చేయించుకున్నాడు. అతను చూపించిన అభిమానానికి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని ఆనంద్ మహీంద్రా స్పెషల్ గా షేర్ చేయడం గమనార్హం.

 

అయితే... నిజానికి ఆ వీడియోలో అతను మెస్సీ ముఖంతో హెయిర్ కట్ చేయించుకున్నది ఇఫ్పటి వీడియో కాదట. నాలుగు సంవత్సరాల క్రితం... ఫిఫా వరల్డ్ కప్ సమయానిదట. అప్పుడే మెస్సీ పై అతను అలా అభిమానం చూపించడం విశేషం. ఆ పాత వీడియోని.... మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోకి 234 వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

నెటిజన్లు... కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హెయిర్ స్టైల్ చేయించుకున్న వ్యక్తి మాత్రమే కాదు.... ఆ హెయిర్ స్టైల్ చేసిన వ్యక్తి పై సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతను హెయిర్ స్టైల్ లో పికాసో లాంటివాడని... లేకపోతే అంత అద్భుతంగా ఎలా హెయిర్ కట్ చేస్తాడు అని అందరూ ప్రశంసించడం విశేషం. మరికొందరు... మెస్సీ ఎందరికో ఆదర్శమని... అలాంటి వ్యక్తి పై ఈ మాత్రం అభిమానం చూపించడంలో ఎలాంటి తప్పులేదని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే