అండర్‌గ్రౌండ్ రెస్టారెంట్లు, సీక్రెట్ బార్లు.. చైనా కొవిడ్ లాక్‌డౌన్‌ కంచెను దాటుతున్న ప్రజలు

By Mahesh KFirst Published Dec 6, 2022, 5:24 PM IST
Highlights

చైనాలో ఒక వైపు కఠిన లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతుంటే.. మరోవైపు సీక్రెట్‌గా రెస్టారెంట్లు, బార్లు నడుస్తున్నాయి. బయటి నుంచి తాళం వేసే ఉంటాయి. కానీ, లోపల సర్వీసు అందుబాటులో ఉంటుంది. లోపటికి తెలిసినవాళ్ల ద్వారా మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉన్నది.
 

న్యూఢిల్లీ: చైనాలో కొవిడ్ రిస్ట్రిక్షన్‌లు చాలా కఠినంగా అమలు అవుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కండీషన్లతో అక్కడి ప్రజలు మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇదంతా తొలినాళ్లలో.. ఇప్పుడిప్పుడే అక్కడ కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. ఉదాహరణకు కరోనా పాజిటివ్ అని తెలిసినా హోం క్వారంటైన్‌కు అనుమతి ఇస్తున్నారు. కానీ, రెండేళ్లుగా కరోనా కండీషన్లతో వేగలేకపోతున్న కొందరు కొంత సేద తీరడానికి, ఇంకొంత రిలాక్స్ కావడానికి సీక్రెట్‌గా రెస్టారెంట్లు, బార్లకు వెళ్లుతున్నట్టు ఓ న్యూస్ ఏజెన్సీ కథనం వెల్లడించింది.

అక్కడ చాలా పకడ్బందీగా అండర్ గ్రౌండ్ రెస్టారెంట్లు, సీక్రెట్ బార్లు నడుపుతున్నారు. వీటిలోకి అందరికీ ఎంట్రీ లేదు. కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా లేదా తెలిసి ఉన్నవారి సర్కిల్‌లోని వారికే ఇందులోకి అనుమతి ఉంటుంది. ఒకావిడ ఇలాగే సీక్రెట్ రెస్టారెంట్ల కోసం వెతికింది. ఇన్‌స్ట్రాగ్రామ్ తరహాలో ఉండే చైనా యాప్‌లో ఇందుకోసం వెతికి చివరికి పట్టుకోగలిగింది. ఆ తర్వాత పేర్కొంటూ ఇది చాలా సీక్రెట్‌గా ఉన్నదని, కింది నుంచి సెకండ్ ఫ్లోర్‌లోని లైట్లను కూడా మీరు చూడలేరు అని వివరించింది. బయటి ఫుడ్ తిన్నందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నానని, కానీ, అండర్‌గ్రౌండ్ బ్యాటిల్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిసి బాధపడ్డానని పేర్కొంది.

Also Read: ఆపిల్ ఫ్యాక్టరీ నుండి గోడ ఎక్కి పారిపోతున్న ఉద్యోగులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కారణం ఏంటంటే..?

చైనా నిబంధనల సడలింపులను ఆధారంగా చేసుకుని కొందరు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. క్యాపిటల్ సిటీలోని కొన్ని చోట్ల డైన్ ఇన్ సర్వీస్‌కు అనుమతి ఉన్నది. దీన్ని ఆసరాగా వాడుకుని చాలా చోట్ల సీక్రెట్‌గా రెస్టారెంట్లు నడుపుతున్నారు.

మరొకరు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ తనను రెస్టారెంట్‌లోకి వెళ్లనివ్వలేదని, కేవలం టేక్ ఔట్‌ మాత్రమే ఉన్నదని గార్డులు సమాధానం ఇచ్చారని వివరించారు. కానీ, తన మిత్రులు పై అంతస్తులో తింటున్నారని చెప్పగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని తెలిపారు.

మూసేసిన హోటళ్లు, కార్ పార్కులు, గజిబిజీ రోడ్ల మధ్యలో నుంచి ఈ సీక్రెట్ రెస్టారెంట్ కు వెళ్లడం అసాధారణంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ రెస్టారెంట్ బయటి నుంచి లాక్ వేసి ఉన్నదని తెలిపారు.

click me!