ఇండియన్ మసాలాకి అమెరికన్ సూపర్ మోడల్ ఫిదా.. ఫోటో వైరల్

Published : Dec 30, 2020, 08:58 AM ISTUpdated : Dec 30, 2020, 09:00 AM IST
ఇండియన్ మసాలాకి అమెరికన్ సూపర్ మోడల్ ఫిదా.. ఫోటో వైరల్

సారాంశం

నెటిజన్లు అడిగిన ఫోటోని స్టేటస్ లో షేర్ చేయాలనమాట. ఈ ఛాలెంజ్ చాలా మంది సెలబ్రెటీలు చేశారు. కాగా.. ఇదే ఛాలెంజ్ ని ఈ సూపర్  మోడల్ గిగి హ్యాడిడ్ కూడా చేశారు. 

ప్రముఖ అమెరికన్ సూపర్ మోడల్, ఫ్యాషన్ మోడల్ గిగి హ్యాడిడ్ గురించి చాలా మంది ఫ్యాషన్ ప్రియులకు తెలిసే ఉంటుంది. కాగా.. ఆమె  సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో వేలల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రెటీలంతా.. ‘ పోస్ట్ ఏ పిక్చర్’ అనే ఛాలెంజ్ చేశారు. 

అంటే.. నెటిజన్లు అడిగిన ఫోటోని స్టేటస్ లో షేర్ చేయాలనమాట. ఈ ఛాలెంజ్ చాలా మంది సెలబ్రెటీలు చేశారు. కాగా.. ఇదే ఛాలెంజ్ ని ఈ సూపర్  మోడల్ గిగి హ్యాడిడ్ కూడా చేశారు. ఆ ఛాలెంజ్ లో అభిమానులు ఆమెను రకరకాల ఫోటోలు షేర్ చేయమని అడిగారు. వాటిని ఆమె షేర్ చేశారు.

ఈ క్రమంలో ఆమె చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   ఓ నెటిజన్ ఆమెను మీ కిచెన్ లో వాడే వస్తువుల ఫోటోలు షేర్ చేయమని కోరారు. కాగా.. ఆమె వెంటనే తాను కిచెన్ లో వాడే మసాలా ల ఫోటోలను షేర్ చేశారు. దాంట్లో మొత్తం ఇండియన్ మసాలాలు ఉండటం విశేషం.

మరీ ముఖ్యంగా పసుపు, జీలకర్ర, గరం మసాలా, తందూరీ మసాలా లాంటివి ఉన్నాయి. వాటి  మీద పేర్లు కూడా రాసి ఉన్నాయి. కాగా.. ఆ ఫోటోకి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది. ఇండియన్ మసాలాలను ఆమె వాడుతున్నారని తెలిసి అభిమానులు షాకయ్యారు. సూపర్ మోడల్ గిగి.. దేశీ అయిపోయారంటూ పేర్కొనడం విశేషం.

ఇదిలా ఉండగా.. గిగి హ్యాడిడ్.. రెండు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ లో తన ప్రెగ్నెన్సీ వార్తను అభిమానులతో పంచుకున్నారు. గిగితోపాటు.. ఆమె భర్తకి కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 


  

 

  

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి