ట్రంప్ భారత్ పర్యటన: అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక కార్ "బీస్ట్" ప్రత్యేకతలివే...

By telugu teamFirst Published Feb 22, 2020, 3:36 PM IST
Highlights

ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న తరుణంలో మరోసారి ఆయన కార్ వార్తల్లోకెక్కింది. బీస్ట్ అని ముద్దుగా పిలుచుకునే ఈ కార్ కి అనేక ప్రత్యేకతలున్నాయి. దీనిపైనా మీడియాలో తెగ కథనాలు కూడా వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీలలో భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన నేరుగా అహ్మదాబాద్ లో దిగి అక్కడ నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంలో పాల్గొంటాడు. అక్కడినుండి ఆగ్రా బయల్దేరి వెళ్లి అక్కడ తాజ్ మహల్ ని సందర్శిస్తారు. తెల్లారి ఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఇతర దేశాధినేతలు భారత్ లో పర్యటిస్తే.... వారి రక్షణ బాధ్యతలు, వారి రవాణా అన్నిటిని భారత దేశం చూసుకుంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు పర్యటిస్తున్నదంటే అన్ని రూల్స్ మారిపోతాయి. ఆయన సెక్యూరిటీ సిబ్బంది నుండి మొదలు... ఆయన ప్రయాణించే కార్లు, కాన్వాయ్ తో సహా అంతా ఆయనతోపాటు రావలిసిందే. 

ఇప్పుడు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న తరుణంలో మరోసారి ఆయన కార్ వార్తల్లోకెక్కింది. బీస్ట్ అని ముద్దుగా పిలుచుకునే ఈ కార్ కి అనేక ప్రత్యేకతలున్నాయి. దీనిపైనా మీడియాలో తెగ కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ కార్ ప్రత్యేకతలను క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 

బీస్ట్ అని ముద్దుగా పిలుచుకునే ఈ కారును గెనేరం మోటార్స్ చాసిస్ మీద నిర్మించడం జరిగింది. ఈ కారులో ఎన్ని హంగులున్నాయో అంతకన్నా ఎక్కువగా రక్షణ వ్యవస్థలున్నాయి. ఈ కారులోని ఫ్రిడ్జ్ నిండా ట్రంప్ గ్రూపుకు సంబంధించిన రక్తం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. 

ఈ కారు పూర్తిగా బులెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్, పంచర్లను కూడా తట్టుకోగలిగే విధంగా ఈ కార్ టైర్లు తాయారు చేయబడ్డాయి. ఈ కారులో అధ్యక్షుడికి కావలిసిన సమస్తం అమర్చబడి ఉంటాయి.

ఈ కారు డోర్లు 8అంగుళాల మందంతో తయారు చేయబడతాయి. ఆ డోర్ల మందం దాదాపుగా బోయింగ్ 757 విమానం డోర్ అంత మందంగా ఉంటాయి. ఈ కార్ కిటికీలు కూడా 5 అంగుళాల మందమైన అడ్డహంతో తయారు చేయబడతాయి. పూర్తిగా బులెట్ ప్రూఫ్ గా డిజైన్ చేయబడతాయి. 

ఇందులోని రక్షణ చర్యల విషయానికి వస్తే... ప్రెసిడెంట్ కోసం  టియర్ గ్యాస్ షెల్స్, ఫుల్లీ లోడెడ్ గన్స్, గ్రెనైడ్ లాంచర్లు సిద్ధంగా ఉంటాయి. ఆయన మీట నొక్కితే అన్ని బయటకు వచేయడమే. జీవ, రసాయన దాడులను కూడా తట్టుకొని నిలిచేదిగా దీన్ని తాయారు చేసారు. 

దీనిలో అన్ని కిటికీలు తెరుచుకోవు. కేవలం డ్రైవర్ కిటికీని మాత్రమే కిందకు దించగలం. అదికూడా కేవలం ఒక మూడు అంగుళాల మేర మాత్రమే. అంతే కాకుండా ఈ కారులో సొంత ఆక్సిజన్ సప్లై ఉంటుంది.

ట్రంప్ కోసం ఒక ప్రత్యేకమైన సాతేల్లితే ఫోన్ ఆకేరులో ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందులోంచి ఆయన నేరుగా ఉపాధ్యక్షుడితో, పెంటగాన్ తో మాట్లాడవచ్చు. 

ఇక ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారును నడిపేందుకు ఒక ప్రత్యేక డ్రైవర్ ను అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది. అతడే ఈ కారు బాధ్యతలను చూసుకుంటాడు. ఈ కారుకు ముందు వెనకా అధునాతన రక్షణ హంగులతు కూడిన మరో నాలుగు కార్లు ఉంటాయి. అందులో నిష్ణాతులైన కమాండోలు సర్వత్రా అధ్యక్షా ప్రాణాలను కంటికి రెప్పలా కాచి కాపాడుతుంటారు. 

click me!