అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కేసులో ఊహించని ట్విస్ట్..!

By Rajesh KarampooriFirst Published Feb 8, 2023, 4:49 AM IST
Highlights

తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి సోమవారం మృతిచెందాడు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి.. ఎంఎస్‌ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ…  సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ఓ తెలంగాణ యువకుడిని ఊహించని రీతిలో  మృత్యువు కబళించింది. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రమాదవశాత్తు తూటా తగిలి ఆ యువకుడు కన్నుమూశాడు. ఈ ఘటన అమెరికాలోని అల్బామా నగరంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌ వద్ద మంగళవారం తెల్లవారు జామున(భారత కాలమాన ప్రకారం) జరిగింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి అఖిల్‌ సాయి(25) మరణించాడు. అదే సమయంలో గోలి రవితేజ(23) అనే మరో తెలుగు యువకుడిని అక్కడి స్థానిక పోలీసులు హత్యానేరం కింద అరెస్టు చేశారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి రాజారావు ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. హైదరాబాద్‌లో కిరాణా దుకాణం  నిర్వహిస్తున్న ఆయనకు ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో తన పెద్ద కుమారుడు అఖిల్‌ సాయి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అతడు అల్బామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. అదే సమయంలో ఖర్చుల కోసం.. పార్ట్ టైంగా సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 

అయితే.. మంగవారం రోజున అదే పెట్రొల్ బాంకులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డుకు చెందిన తుపాకీని అఖిల్‌ పరిశీలిస్తుండగా.. ఆ తుపాకీ ప్రమాదశాత్తు ప్రమాదశాత్తు పేలింది. దీంతో అఖిల్‌ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. ఆ సెక్యూరిటీ గార్డు రవితేజ అని సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అక్కడి పోలీసుల ప్రాథమిక విచారణలో  తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కాదనీ, తోటీ విద్యార్థి గోలి రవితేఖతో జరిగిన తోపులాటలో కాల్పులు జరిగినట్టు సమాచారం. చివరకు తోటీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో చనిపోయాడని పేర్కొనడంతో .. అతని మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
కాగా, అఖిల్‌సాయి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అక్కడి తెలుగు విద్యార్థులు, తానా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారని వారి బంధువులు తెలిపారు.
 

click me!