భూకంప బాధితులకు అండగా నిలిచిన భారత్.. టర్కీకి చేరిన భారత వైద్య బృందం.. 

By Rajesh KarampooriFirst Published Feb 8, 2023, 2:28 AM IST
Highlights

భారత వైమానిక దళం C-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానం ద్వారా సహాయ సామగ్రిని టర్కీకి పంపుతున్నారు. అదే సమయంలో.. సిరియాలో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడానికి, భారతదేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ C-130 ద్వారా వైద్య సామాగ్రిని పంపింది. భారత వైమానిక దళానికి చెందిన విమానంలో 6 టన్నుల అత్యవసర సహాయాన్ని తీసుకుని సిరియాకు బయలుదేరింది.

టర్కీ - సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో సహాయ, సహాయక చర్యలు అందించడానికి భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుండి సహాయక బృందాలు తమ రెస్క్యూ సిబ్బంది, ఆర్థిక సహాయం,సామగ్రిని పంపుతున్నాయి. ఈ క్రమంలో భారత్ భూకంప బాధితులకు అండగా నిలిచింది. వారిని ఆదుకోవడానికి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా సహాయ సామాగ్రి, 30 పడకల వైద్య సదుపాయాన్ని అందించడానికి భారత్ మంగళవారం ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌ను పంపింది.  

భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానంలో 45 మంది సభ్యుల వైద్య బృందంతో బయలుదేరారు. ఇందులో క్రిటికల్ కేర్ నిపుణులు, సర్జన్లు ఉన్నారు. అదే సమయంలో సిరియాలో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడానికి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ C-130 ద్వారా వైద్య సామాగ్రిని పంపింది. భారత వైమానిక దళానికి చెందిన విమానం 6 టన్నుల అత్యవసర సహాయాన్ని తీసుకుని సిరియాకు బయలుదేరింది.

అంతర్జాతీయ వేదికలపై టర్కీ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం 200 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, స్నిఫర్ డాగ్‌లు, మందులతో పాటు వైద్య బృందాన్ని టర్కీకి పంపడం గమనార్హం. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు, వైద్య సిబ్బందితో సహా రెండు సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపనున్నట్లు భారత్ తెలిపింది. సోమవారం రాత్రి వైమానిక దళానికి చెందిన C-17 విమానం టర్కీకి బయలుదేరింది. NDRF, రెస్క్యూ టీమ్‌లతో పాటు ఇతర భారతీయ సంస్థలతో పాటు IAF సహాయ చర్యలో పాల్గొంటుంది.  

భారత సైన్యం 89 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని టర్కీకి పంపింది. ఈ బృందం వైద్య నిపుణులను కలిగి ఉంది. ఎక్స్-రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లు, సంబంధిత పరికరాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో భూకంపంలో మరణించిన వారి సంఖ్య 7,100కి చేరుకున్నట్టు తెలుస్తోంది. 

click me!