ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చిన ఎయిర్‌హోస్టెస్.. సోషల్ మీడియా జేజేలు

By sivanagaprasad kodatiFirst Published Nov 11, 2018, 4:09 PM IST
Highlights

విమానంలోకి వచ్చే ప్రయాణికులకు సాదర స్వాగతం పలకడం.. ప్రయాణ సమయంలో వారికి సహాయం చేయడం ఎయిర్‌హోస్టెస్‌ల పని. అయితే ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి ఓ ఎయిర్‌హోస్టెస్ అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది.

విమానంలోకి వచ్చే ప్రయాణికులకు సాదర స్వాగతం పలకడం.. ప్రయాణ సమయంలో వారికి సహాయం చేయడం ఎయిర్‌హోస్టెస్‌ల పని. అయితే ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి ఓ ఎయిర్‌హోస్టెస్ అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది.

ఫిలిప్పిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్‌హోస్టెస్ రోజువారిగానే తన డ్యూటీకి వెళ్లి తన పనులు తాను చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది.. దీంతో ఆమె ఆ పాప తల్లి వద్దకు వెళ్లి ఆరా తీసింది.. ఏమైందని అడగ్గా పాపకు పట్టే ఫార్ములా పాలు అయిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంది.

అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయిపోవడం.. తోటీ ప్రయాణికులంతా ఏమైందని అడుగుతుండటం.. విమానంలో మామూలు పాలు తప్పించి ఫార్ములా పాలు లేకపోవడంతో ఎయిర్‌హోస్టెస్‌లోని తల్లి హృదయం స్పందించింది. ఎక్కడో కదిలినట్లుగా అనిపించి వెంటనే తన బిడ్డ గుర్తు రావడంతో వెంటనే ఆ బిడ్డకు తన పాలు ఇవ్వాలని అనుకుంది.

ఆ పాపను ఒడిలోకి తీసుకుని పాలు పట్టింది.. చాలా ఆకలితో ఉన్న ఆ పాప.. ఆతృతగా తాగింది.. పాలు తాగిన తర్వాత ఏడుపు ఆపి.. నిద్రపోయాక ఆ తల్లికి అప్పగించింది. దీంతో ఆ పాప తల్లి ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ విషయాన్ని ఆమె ‘‘ మనసు చాలా తృప్తి పడే పనిచేశాను అంటూ ’’ సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌కు ఏకంగా 35 వేలకు పైగా షేర్లు, 8.1 వేల కామెంట్లు రావడం విశేషం..

దీనిపై ప్రతీశా స్పందిస్తూ.. ఆ క్షణాన ఆ బిడ్డ ఆకలి తీర్చే శక్తినిచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలిపింది.. ఇదేమీ గొప్పపని కాదు.. కానీ తృప్తినిచ్చే పని. ఈ రోజు నా ఫ్లయింగ్ కెరీర్‌లోనే ఓ అద్భుతమైన రోజని పోస్ట్ చేసింది.

 

click me!