‘తలొగ్గేది లేదు.. అంతు చూడడమే..’ తాలిబన్ల మీద పోరుకు పంజ్ షేర్ సై...

By AN TeluguFirst Published Aug 27, 2021, 11:35 AM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ వార్తాసంస్థ టోలో పాత్రికేయుడు జియాద్ యాద్ ఖాన్ తాలిబన్ల చేతుల్లో మరణించారనే వార్తలు కాసేపు కలకలం రేపాయి. టోలో న్యూస్ కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరించింది. 

ఆఫ్ఘనిస్థాన్ : దేషాన్ని ఆక్రమించి.. తమ వైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని తేల్చి పంజ్ షేర్ సైనికులు తేల్చి చెప్పారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశ్యమే లేదని, వారి అంతు చూస్తామని ప్రకటించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఉత్తర కూటమితో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ మాజీ కమాండర్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలాగే ఆఫ్గన్ ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు.  పొరుగు దేశం తజకిస్థాన్ సైతం పంజ్ షేర్ సైనికులు  మద్దతు పలికింది. 

ఆఫ్ఘనిస్తాన్ వార్తాసంస్థ టోలో పాత్రికేయుడు జియాద్ యాద్ ఖాన్ తాలిబన్ల చేతుల్లో మరణించారనే వార్తలు కాసేపు కలకలం రేపాయి. టోలో న్యూస్ కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరించింది. అయితే ‘తాను మరణించలేదని, ఆ వార్తలు అవాస్తవాలని’ జియార్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో అనిశ్చితి తొలగిపోయింది. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని తన వద్ద ఉన్న కెమెరాలు, ఫోను, ఇతర సాంకేతిక పరికరాలను లాక్కున్నట్లు జియార్ తెలిపారు.

కరువు, కోవిడ్ 19 వంటి విపత్తులకు తోడు ఇటీవల నెలకొన్న పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో మహా మానవ సంక్షోభానికి దారి తీస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఫుడ్ రిలీజ్ ఏజెన్సీ పేర్కొంది. వరల్డ్ ప్రోగ్రాం (డబ్ల్యూ ఎఫ్ పీ) బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం..  ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతి ముగ్గురిలో ఒకరు ( దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నారు.

దాదాపు 20 లక్షల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపం ఎదుర్కొంటున్నట్లు తేలింది. వారికి వెంటనే వైద్యం అవసరమని నివేదిక పేర్కొంది. దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు,  ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో ఆఫ్ఘన్లో గోధుమల ధర గత నెలరోజుల్లోనే 25 శాతం పెరిగాయి. 

kabul bombers : ‘మా సైనికుల ప్రాణాలు తీసిన వారిని వెంటాడి, వేటాడి మట్టుబెడతాం..’ జో బైడెన్

కాగా, కాబూల్ ఎయిర్ పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్  ఖోరసాన్ (కె) గ్రూపు మానవబాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనలో 60మంది చనిపాగా.. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్ పోర్ట్ జంట పేలుళ్ల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. ఈ దాడిని అంత తేలికగా మేం మరిచిపోం... ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి, వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం..’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. ఆఫ్గన్ గడ్డమీద అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన... మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్... సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. 

click me!