ఆల్‌ఖైదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాల్చివేత

Published : Oct 25, 2020, 03:55 PM IST
ఆల్‌ఖైదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాల్చివేత

సారాంశం

మోస్ట్ వాంటెడ్ ఆల్ ఖైదా ఉగ్రవాది ఆల్ మస్రీని భద్రతా దళాలు కాల్చి చంపాయి.

కాబూల్: మోస్ట్ వాంటెడ్ ఆల్ ఖైదా ఉగ్రవాది ఆల్ మస్రీని భద్రతా దళాలు కాల్చి చంపాయి.ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక భద్రతా దళం మస్రీని కాల్చి చంపినట్టుగా ఆ దేశం ప్రకటించింది. 

మధ్యఘజ్ని ఫ్రావిన్స్ లో ఈ ఉగ్రవాదిని హతమార్చినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా డైరెక్టరేట్ ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా ఆ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.

ఈజిప్ట్ జాతీయుడైన ఆల్ మస్రీని టెర్రరిస్ట్ గ్రూప్ ఆల్ ఖైదాలో నంబర్ టూ గా భావిస్తారు. అబ్దుల్ రపూఫ్ పేరుతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు.

అమెరికా పౌరులను చంపేందుకు మస్రీ కుట్ర పన్నారని సమాచారం అందడంతో 2018 డిసెంబర్ లో అమెరికా ప్రభుత్వం వారెంట్ జారీ చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చల మధ్య జరుగుతున్న సమయంలో ఈ హత్య జరగడం కలకలం చోటు చేసుకొంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే