తలకు కొమ్ములు... బాడీకి 516 సర్జరీలు: గిన్నిస్‌కెక్కిన వింత మనిషి

By Siva Kodati  |  First Published Oct 25, 2020, 2:38 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 వందలకు పైగా సర్జరీలు చేయించుకి గిన్నిస్ బుక్‌లోకెక్కాడు. జర్మనీకి చెందిన రోల్ప్‌ బుచోల్జ్‌ అనే వ్యక్తి దాదాపు 516 మించి బాడీ మోడిఫికేషన్‌ చేయించుకున్నాడు.


ముక్కు వంకరగా వుందని, పెదవి బాలేదనో అందం కోసం సర్జరీలు చేయించుకునేవారు ఎందరో ఉన్నారు. అంతెందుకు మనం ఎంతగానో ఆరాధించే  సినీ తారలు సైతం ఈ జాబితాలో ఉన్నారు.

వాళ్లను స్పూర్తిగా తీసుకుని అందానికి మెరుగులు దిద్దేవారు కోకొల్లలు. అయితే ఓ వ్యక్తి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 వందలకు పైగా సర్జరీలు చేయించుకి గిన్నిస్ బుక్‌లోకెక్కాడు.

Latest Videos

undefined

జర్మనీకి చెందిన రోల్ప్‌ బుచోల్జ్‌ అనే వ్యక్తి దాదాపు 516 మించి బాడీ మోడిఫికేషన్‌ చేయించుకున్నాడు. అయినప్పటికీ ఇంకా శరీరాన్ని మార్చడం పూర్తి కాలేదని చెప్పి రోల్స్‌ అందరిని ఆశ్చర్యపరిచాడు.

రోల్ప్‌ 2010లో 453 ఆపరేషన్స్‌, పచ్చబొట్లు, ఇంప్లాంట్లు చేయించుకుని అత్యధిక సంఖ్యలో శరీరంపై కుట్లు వేసుకున్న వ్యక్తిగా గిన్నిస్ అతడిని గుర్తించింది. ఐదేళ్ల తర్వాత పలు మార్పులు‌ చేయించుకున్న రోల్స్‌ నుదుటిపై రెండు కొమ్ములు అమర్చుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌కు ఎక్కాడు.

అనంతరం గిన్నిస్‌ వారు సోషల్‌ మీడియాలో రోల్స్‌ వీడియోలను షేర్‌ చేయడంతో అతడు వైరల్‌ అయ్యాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ ప్రకారం... రోల్ప్‌ జర్మనీలోని ఒక టెలికాం కంపెనీలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో పనిచేస్తున్నాడు.

అతడు 40 ఏళ్ళ వయసులోనే మొట్టమొదటి సారిగా పచ్చబొట్టు, ఆపరేషన్‌ చేసుకుని తన బాడీ మోడిఫికేషన్‌ ప్రారంభించాడు. అప్పటి నుంచి రోల్స్‌ తన పెదవులు, కనుబొమ్మలు, ముక్కు, నుదిటిపై రెండు చిన్న కొమ్ములతో పాటు 20 ఏళ్లుగా అనేక మార్పులు‌ చేయించుకున్నాడు. దీంతో రోల్స్‌ పూర్తిగా గుర్తుపట్టేలేనంతగా మారిపోయాడు.

click me!