విజేతను నేనే, బైడెన్ కాదు: పాతపాటే పాడిన ట్రంప్

Published : Jan 13, 2021, 01:44 PM IST
విజేతను నేనే, బైడెన్ కాదు: పాతపాటే పాడిన ట్రంప్

సారాంశం

ఎన్నికల్లో తానే విజేతను... బైడెన్ కాదు అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.  


వాషింగ్టన్:  ఎన్నికల్లో తానే విజేతను... బైడెన్ కాదు అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

మంగళవారం నాడు టెక్సాస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్ భవనం కేపిటల్ హిల్ భవనం పై తన మద్దతుదారులు దాడి చేయడానికి ముందు తాను చేసిన ప్రసంగాన్ని ట్రంప్ సమర్ధించుకొన్నాడు.

ఎన్నికల్లో నిజమైన విజేతను నేనే.. బైడెన్ కాదు అని ఆయన మరోసారి ప్రకటించారు. తనకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో డెమెక్రాటిక్ నేతలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం పూర్తిగా అసంబద్దమని ఆయన పేర్కొన్నారు.

ఇది అత్యంత భయంకరమైన చర్యగా ఆయన చెప్పారు. దేశంలో ఆగ్రహావేశాలకు ఇది దారితీస్తోందన్నారు. అయినా మేం హింసను కోరుకోవడం లేదని చెప్పారు. అమెరికా రాజకీయ చరిత్రలో క్షుద్ర వేటగా ఈ ప్రక్రియ మిగిలిపోతోందని అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అక్రమ వలసలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. అమెరికా మెక్సికో సరిహద్దు గోడను విజయవంతంగా నిర్మించిందని  ఆయన వివరించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..