ట్విట్టర్ తర్వాత ట్రంప్ కి యూట్యూబ్ షాక్..!

By telugu news teamFirst Published Jan 13, 2021, 12:13 PM IST
Highlights

ట్రంప్‌కు చెందిన ఛానెల్‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆ ఛానల్‌లో ఉన్న ఓ వీడియోను కూడా డిసేబుల్ చేసింది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి సోషల్ మీడియా, టెక్ కంపెనీలు ఒక దాని తర్వాత మరొకటి ఊహించని షాక్ లు ఇస్తున్నాయి.  ఇప్పటికే.. ట్రంప్ కి ఫేస్ బుక్, ట్విట్టర్ లు షాకిచ్చాయి. తమ వేదికలను వినియోగించేందుకు వీలులేకుండా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థలు ఇప్పటికే ట్రంప్‌‌పై నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబ్ కూడా వచ్చి చేరింది. 

ట్రంప్‌కు చెందిన ఛానెల్‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆ ఛానల్‌లో ఉన్న ఓ వీడియోను కూడా డిసేబుల్ చేసింది. ‘కనీసం ఏడు రోజుల పాటు’ ఈ నిషేధం అమల్లో ఉంటుందని యూట్యూబ్ పేర్కొంది. అయితే ఈ నిషేధాన్ని మరింత కాలం పాటు కొనసాగించేందుకు యూట్యూబ్ ఈ రకమైన ప్రకటన చేసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కాగా.. ట్రంప్‌కు చెందిన అకౌంట్లపై ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్‌ ఇప్పటికే వేటు వేశాయి. యూట్యూబ్ కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలంటూ  హాలీవుడ్ స్టార్లు, ఇతరు ప్రముఖుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్‌ కూడా మిగతా సామాజిక మాధ్యమాల నిర్ణయాన్నే అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హింస చెలరేగే అవకాశం ఉండటంతో ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఛానల్‌లోని కామెంట్ సెక్షన్ కూడా డిసేబుల్ చేసింది. 

click me!