cash garland: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని దృశ్యాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఒక వివాహ వేడుకలో వరుడుకి వేస్తున్న కరెన్సీ నోట్లతో ఉన్న భారీ నగదు మాల సోషల్ మీడియా వైరల్ గా మారింది.
Viral video: వేడుకలు.. అందులో పెండ్లి అంటే కోలాహలం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ మధ్య కాలంలో వివాహ వేడుకలలో వధూవరులకు వారి స్నేహితులు, బంధులువు అందిస్తున్న కానుకలు, బహుమతులు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పెండ్లి వేడుకలో వరుడికి వేసిన మాల సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అందర్నీ ఆకర్షిస్తున్న ఆ దండ ప్రత్యేకత ఏంటీ అనుకుంటున్నారా? అది నోట్లతో తయారు చేసిన మాల. నోట్లతో చేస్తే ఏముంది అందులో స్పెషల్ అనుకోకండి.. !
వరుడికి వేసిన నోట్ల కరెన్సీతో తయారు చేసిన ఆ మాల మాములు గా లేదు.. ! ఆ భారీ నగదు మాల.. ఏకంగా పరుపు సైజ్ లో ఉంది. ఐదారు మంది స్నేహితులు కలిసి దానిని వరుడికి వేస్తున్నట్టుగా పట్టుకున్నారు. ఈ భారీ నగదు మాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ స్ట్రాగ్రామ్ షేర్ చేసిన వీడియో దృశ్యాల్లో పెండ్లి వేడుకలో వరుడు తన స్నేహితులతో కలిసి నిల్చున్నాడు. అయితే, అతని స్నేహితులు కరెన్సీ నోట్లతో చేసిన భారీ నగదు మాలను వరుడికి వేస్తున్నారు. ఆ కరెన్సీ నోట్ల మాల ఐదారు మంది పట్టుకుని ఉన్నారు. వారి ముందు కొద్ది దూరం వరకు నేలను తాకుతూ కనిపించింది.
undefined
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 348k పైగా లైక్ లు వచ్చాయి. కామెంట్లు సైతం వేలల్లో ఉన్నాయి. కొందరు ఆ దండ గురించి పేర్కొంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొంత మంది వరుడు, అతని స్నేహితుల బంధం గురించి పేర్కొంటున్నారు. మరికొంత మంది వరుడు మామూలుగా కాకుండా ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నాడంటూ పేర్కొంటున్నారు.
సోషల్ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ పెండ్లి వేడుక పాకిస్థాన్ లో జరిగింది. నిజానికి ఈ వీడియో అక్టోబర్ 6న సోషల్ మీడియాలో కనిపించింది. ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో కూడా చాలా వేడుకల్లో నోట్ల కట్టలతో చేసిన దండలు వేయడం కనిపించింది. పలు కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చే వారిపై నోట్లను కురిపిస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే, భారతదేశంలో వేడుకల్లో భాగంగా పెళ్లికొడుకులకు కరెన్సీ నోట్లతో చేసిన దండలు చేసి వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది. బ్యాంకు నోట్లు సార్వభౌమాధికారానికి చిహ్నం కాబట్టి వాటిని గౌరవించాలనీ, ప్రజలు వాటిని దుర్వినియోగం చేయకూడదని సంవత్సరాల క్రితం భారత సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా వాటిని వేడుకల్లో చల్లడం, దండలు చేయడానికి ఉపయోగించడం వల్ల వాటి జీవిత కాలం తగ్గుతుందని తెలిపింది.