ఏడవ అంతస్తునుంచి దూకి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. ఎక్కడంటే...

Published : Mar 26, 2022, 09:35 AM IST
ఏడవ అంతస్తునుంచి దూకి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. ఎక్కడంటే...

సారాంశం

స్విట్జర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి ఐదో అంతస్తులోని తమ ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎందుకు చనిపోయారంటే... 

స్విట్జర్లాండ్ : ఇంతవరకు చాలామంది ఏవేవో కారణాల వల్ల suicide చేసుకుని చనిపోవడం గురించి విన్నాం. financial issuesల వల్లనో లేక భయంకరమైన సమస్యలకు తాళలేక చనిపోయిన ఘటనలు చూశాం. ఇక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు ఏ కారణం లేకుండా అది కూడా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన Switzerland లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే… స్విట్జర్లాండ్లోని మాట్రిక్స్ లో ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు 7వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేశారు.  అయితే,  వారు తమ కొడుకుని పాఠశాలకు పంపించకుండా ఇంటివద్ద చదివించడానికి గల కారణాలు విచారించేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు.  వారు ఎంతసేపు తలుపు కొట్టినా ఎలాంటి స్పందన కనిపించచకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే కాసేపటికి ఒక ఇంట్లోనే సభ్యులు బాల్కనీ నుంచి దూకేశారు అంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఘటనాస్థలానికి రాగానే కుటుంబ సభ్యులు నలుగురు చనిపోయి కనిపించారు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.  కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు చాలా ఏళ్లుగా స్విట్జర్లాండ్లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్ డ్ గా ఉంటుందని పెద్దగా ఎవరితోనూ కలవరని స్థానికులు చెబుతున్నారని అన్నారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపించకుండా హోమ్ స్కూల్లో చదివించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే  ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. 

ఇదిలా ఉండగా, గత నెల ఫిబ్రవరి 21న కేర‌ళ‌లో ఇలాంటి దారుణమే జ‌రిగింది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు స‌భ్యులు అనుమాన‌స్ప‌దంగా మృతి చెందారు. ఈ ఘ‌ట‌న త్రిస్సూర్ జిల్లా కొడంగల్లూర్ పట్టణంలోని ఉజువతుకడవు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతులను ఆషిక్ (41), అతని భార్య అబీరా (34), వారి పిల్లలు ఫాతిమా (14), అనోనీసా (8)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ కుటుంబం ఉజువ‌తుక‌డ‌వు గ్రామంలో నివాసం ఉంటోంది. 

అయితే ఆదివారం మధ్యాహ్నం ఇరుగు పొరుగు వ్య‌క్తులు ఈ కుటుంబాన్ని ప‌ల‌క‌రించ‌డానికి వచ్చారు. ఆ స‌మ‌యంలో ఇంటి డోర్ వేసి ఉంది. ఫోన్ చేసినా కుటుంబ స‌భ్యుల ఎవ‌రి నుంచీ స్పంద‌న రాలేదు. దీంతో ఇంటి డోర్ కు లోప‌లి నుంచి లాక్ వేసి ఉంద‌ని గ‌మ‌నించారు. అలాగే కిటికీలకు టేపులు అతికించి క‌నిపించాయి. వారికి అనుమాన‌ం వచ్చి పోలీసులు స‌మాచారం అందించారు. పోలీసులకు వాళ్ల బెడ్ రూమ్ లో మృతదేహాలు క‌నిపించాయి. ఆ గ‌దిలో వారికి గ్యాస్ వాస‌న వ‌చ్చింది.ఆ కుటుంబసభ్యులు విషవాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..