రన్ వే పై జారిన విమానం.. 157మందికి తప్పిన ప్రమాదం

By ramya neerukondaFirst Published 17, Aug 2018, 4:09 PM IST
Highlights

ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 157మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు.. ప్రమాదం తృటిలో తప్పడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

విమానం ల్యాండ్ అవుతుండగా.. రన్ వే జారిన సంఘటన ఫిలిప్పైన్స్‌లోని మనీలాలో గత రాత్రి చోటుచేసుకుంది. వర్షాల కారణంగా రన్‌వే బాగా తడిసిపోయి ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 157మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు.. ప్రమాదం తృటిలో తప్పడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదం కారణంగా రన్‌వేను తాత్కాలికంగా మూసేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విమానం పూర్తిగా రన్‌వే పైనుంచి జారిపోయి పక్కన గడ్డిమైదానంలోని ఫెన్సింగ్‌ దగ్గరికి దూసుకెళ్లింది. విమానం ఒక రెక్క నేలకు తగిలింది. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానాశ్రయ రన్‌వే మూసేయడంతో చాలా విమానాలు నిలిచిపోయాయి. దీంతో మనీలా విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రన్‌ వేను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. మధ్య ప్రాచ్యం, అమెరికా నుంచి వచ్చే విమానాలను క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తున్నారు.


 

Last Updated 9, Sep 2018, 11:33 AM IST