భార్యకు విడాకులు: పిల్లల కోసం తల్లి వేషంలో స్కూల్‌కెళ్లిన తండ్రి

By narsimha lodeFirst Published Aug 16, 2018, 3:17 PM IST
Highlights

తల్లి ప్రేమకు తన పిల్లలు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తండ్రి చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు పొందుతోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని  స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఓ తండ్రి  మహిళ వేషధారణలో వెళ్లి చిన్నారి కోరికను తీర్చాడు. 

బ్యాంకాక్:  తల్లి ప్రేమకు తన పిల్లలు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తండ్రి చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు పొందుతోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని  స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఓ తండ్రి  మహిళ వేషధారణలో వెళ్లి చిన్నారి కోరికను తీర్చాడు.  తల్లి వేషధారణలో వచ్చిన తన తండ్రిని చూసి ఆ చిన్నారి సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

థాయ్‌లాండ్‌కు చెందిన పనుథాయ్‌ అనే వ్యక్తికి ఇద్దరు మగ పిల్లలు.  ఓజోన్, ఇమ్సోమ్ లు.  పనుథాయ్ తన భార్యతో విడిపోయాడు. దీంతో ఆమె యూరప్‌కు వెళ్లిపోయింది. పిల్లల సంరక్షణ బాధ్యతను  అక్కడి న్యాయస్థానం  తండ్రికి అప్పగించింది. దీంతో పిల్లల ఆలనాపాలనను పనుథాయ్‌ చూస్తున్నాడు.

ప్రతి ఏటా థాయ్‌లాండ్‌లో మాతృదినోత్సవాన్ని ఆగష్టు 12వ తేదీన జరుపుకొంటారు.  1976 ఆగష్టు 12న థాయ్ లాండ్ రాణి సిరికిట్ జన్మించారు. అప్పటి నుండి మాతృ దినోత్సవంగా జరుపుకొంటారు.

అయితే వసుథాయ్ పిల్లలు చదువుతున్న పాఠశాలలలో తల్లుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తమ తల్లులను స్కూల్ కు తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

అయితే వసుథాయ్ ‌కు భార్య లేదు. దీంతో పిల్లలను బాధ పెట్టకూడదనే ఉద్దేశ్యంతో  మహిళగా దుస్తులను ధరించి స్కూల్ కు వచ్చాడు. తెల్లటి గౌను, క్లిప్ పెట్టుకొని పాఠశాలకు వచ్చాడు. తల్లి వేషధారణలో స్కూల్ కు  వసుథాయ్ రావడంతో ఆ పిల్లల ఆనందానికి  అడ్డు లేకుండా పోయింది.  వసుథాయ్ స్నేహితుడు  స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీడియో తీశాడు.  ఈ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రసతుతం వైరల్ గా మారింది.


 

click me!