అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8మంది మృతి

Published : Mar 17, 2021, 08:27 AM ISTUpdated : Mar 17, 2021, 08:38 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8మంది మృతి

సారాంశం

అట్లాంటా నగర శివారులోని మూడు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. 

అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. వరుస కాల్పులు, అల్లర్లతో అమెరికా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అట్లాంటా నగర శివారులోని మూడు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మసాజ్‌ సెంటర్లు, స్పా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 

ఈ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న రాబర్డ్‌ ఆరన్‌ లాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత ఆదివారం కూడా చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండుగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. 13 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి దుండగులు కాల్పులు జరపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో దుండుగులు చాలా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో ఇతర దేశాల నుంచి వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే