ఆయన వచ్చాకే అప్పుల ఊబిలోకి.. పాక్ అప్పులు తెలిస్తే షాక్...

Published : Mar 16, 2021, 04:14 PM IST
ఆయన వచ్చాకే అప్పుల ఊబిలోకి.. పాక్ అప్పులు తెలిస్తే షాక్...

సారాంశం

భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. ఎంతగా అంటే కోలుకోలేనంతగా కూరుకుపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అప్పులు భారీగా పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు. 

భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. ఎంతగా అంటే కోలుకోలేనంతగా కూరుకుపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అప్పులు భారీగా పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2005లో పాక్ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్భణం 4 శాతానికి మించి ఉండకూడదు అనేది ఆ నిర్ణయం. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం 8.5 శాతానికి పెరిగింది. 2019 సంవత్సరంలో పాక్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉంటే, రెండేళ్లలో అంటే 2021లో ఆ అప్పులు 45 ట్రిలియన్లకు పెరిగింది. 

ఈ స్థాయిలో అప్పులు పెరిగిపోవడంలో అక్కడి ప్రజలు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే పాక్ లో ఒక్కొక్కరిపై సరాసరి లక్షా 75 వేల రూపాయల అప్పు ఉంది. 

గణాంకాల ప్రకారం దేశంలో ఇమ్రాన్ పాక్ ప్రధాని అయ్యాక 46శాతం మేరకు అప్పులు పెరిగాయని, గతంలో దేశం పరిస్థితి బాగా లేకపోయినా అప్పలు పెరగకుండా చూసుకున్నారని, కానీ, ఇమ్రాన్ ప్రధాని అయ్యాక అప్పులు పెద్ద సంఖ్యలో పెరిగిపోయాయని నివేదికలు చెప్తున్నాయి.  ఇమ్రాన్ హయాంలో 46శాతం మేర పెరిగాయంటేనే ఏ స్థాయిలో అప్పులు చేశారో అర్ధం చేసుకోవచ్చు.  

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?