40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జననం.. ప్రపంచంలో అత్యంత సారవంతమైన మహిళగా గుర్తింపు పొందిన నబతాంజీ

By Asianet NewsFirst Published Apr 12, 2023, 12:19 PM IST
Highlights

ఆఫ్రికాకు చెందిన మరియం నబతాంజీ 40 ఏళ్ల వయస్సులో 44 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచంలోనే  సారవంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ఆమెకు అండాశయంలో ఏర్పడ్డ మార్పులే ఇంత మంది పిల్లలు పుట్టడానికి కారణమైంది. ఆమెను ఉగాండాలో మామా ఉగాండా అని పిలుస్తారు.

ఓ మహిళ 40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాకు చెందిన మరియం నబతాంజీ అనే మహిళ 13 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మహిళగా తాజాగా గుర్తింపు పొందింది. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ మహిళను మామా ఉగాండా అని పిలుస్తారు. నబతాంజీకి 12 ఏళ్ల వయసులో వివాహం అయిన తర్వాత ఆమె మాతృత్వ కథ ప్రారంభమైంది. 

వామ్మో.. దేశంలో 40 వేలు దాటిన యాక్టివ్ కరోనా కేసులు.. కొత్తగా 7,830 కోవిడ్ కేసులు నమోదు..

తల్లిదండ్రులు చిన్నప్పుడే నబతాంజీని అమ్మేశారు. ఒక ఏడాది తరువాత ఆమె తల్లి అయ్యింది. ఆ సమయంలో ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు ఓ వింత వ్యాధిని గుర్తించారు. ఆమెకు అసాధారణంగా పెద్ద అండాశయాలు ఉన్నాయని, ఇది హైపర్ఓవ్యులేషన్ అని పిలువబడే పరిస్థితికి కారణమైందని తెలిపారు. దీంతో ఆమెకు ఎక్కువ మంది పుట్టే అవకాశాలు ఉంటాయని తెలిపారు. గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతారని చెప్పారు. దీంతో పాటు జీవితాంతం వాటిని ఉపయోగించకూడదని డాక్టర్లు ఆమెకు తెలియజేశారు. 

రైతుల కుమారులను పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు రూ.2 లక్షలిస్తాం - కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి హామీ..

కుటుంబ నియంత్రణ పద్ధతి ఆమెకు పని చేయదని వైద్యులు చెప్పారు. దీంతో పాటు పిల్లలకు జన్మనివ్వడం మానేస్తే తీవ్ర రోగాలు వస్తాయని లేదా చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక అప్పటి నుంచి ఆమె పిల్లలకు జన్మనిస్తూనే ఉన్నారు. ఆమె 13 సంవత్సరాల వయస్సులో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

Abused, sold into marriage at 12 years old, and now a single mother of 42 children; Mariam Nabatanzi shares her story. pic.twitter.com/PG72b2iW0X

— Al Jazeera English (@AJEnglish)

నబతాంజీ ఒక్కసారి మాత్రమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత నాలుగుసార్లు కవలలు, ఐదుసార్లు ముగ్గురు, నాలుగుసార్లు ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఆరుగురు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు సజీవంగా ఉన్న 38 మంది పిల్లలలో 20 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరినీ ఆమె ఒంటరిగా పెంచుతోంది.

44-year-old Ugandan woman, Mariam Nabatanzi had given birth to 44 children by the time she was 36.

She has 3 sets of quadruplets, 4 sets of triplets & 6 sets of twins.

She has a genetic condition that makes her release multiple eggs in a cycle.

She is nicknamed Mother Uganda. pic.twitter.com/LEKJInwGgX

— Africa Facts Zone (@AfricaFactsZone)

ఆమె భర్త 2016లో మొత్తం డబ్బుతో ఇంటి నుండి పారిపోయాడు. అదే సంవత్సరంలో ఆమె తన చిన్న బిడ్డకు జన్మనిచ్చింది. కంపాలాకు ఉత్తరాన 31 మైళ్ల దూరంలో ఉన్న పొలాల చుట్టూ ఉన్న గ్రామంలో నబతాంజీ తన పిల్లలతో నివసిస్తుంది. ఆమె సిమెంటుతో చేసిన నాలుగు ఇరుకు ఇళ్లలో పిల్లలతో కలిసి ఉంటోంది. మరియమ్ భర్తను విడిచిపెట్టడంతో ఓ మహిళ ఆమెకు కొన్ని మంచాలు ఇచ్చారు. ఆమె, పిల్లలు వాటిపై పడుకుంటుంటారు. కొందరు పిల్లలు నేలపై పరుపు వేసుకొని పడుకుంటారు. నబతాంజీ తన పిల్లలను పెంచడానికి కటింగ్, జంక్ సేకరించడం, మందులు అమ్మడం వంటి అనేక పనులు చేస్తున్నారు. 

click me!