మానస సరోవర యాత్రలో ప్రమాదం...ఓ భారతీయుడి మృతి

By Arun Kumar PFirst Published 15, Aug 2018, 12:38 PM IST
Highlights

హిందువులు ఎంతో పవిత్రంగా భావించి కైలాస మానస సరోవర యాత్ర చేపడుతుంటారు. ఎంతో కష్టసాధ్యమైన, ప్రమాదకరమైన యాత్ర అయినప్పటికి దేవుడిపై భారం వేసి యాత్ర కొనసాగిస్తుంటారు. ప్రతికూల వాతావరణంలో కొండలు, గుట్టల మధ్యలో ఈ యాత్ర సాగుతుంది. అయితే తాజాగా ఈ యాత్రకు వెళ్లిన ఓ భారతీయ భక్తుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ ఘటన నేపాల్ లో చోటుచేసుకుంది,

హిందువులు ఎంతో పవిత్రంగా భావించి కైలాస మానస సరోవర యాత్ర చేపడుతుంటారు. ఎంతో కష్టసాధ్యమైన, ప్రమాదకరమైన యాత్ర అయినప్పటికి దేవుడిపై భారం వేసి యాత్ర కొనసాగిస్తుంటారు. ప్రతికూల వాతావరణంలో కొండలు, గుట్టల మధ్యలో ఈ యాత్ర సాగుతుంది. అయితే తాజాగా ఈ యాత్రకు వెళ్లిన ఓ భారతీయ భక్తుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ ఘటన నేపాల్ లో చోటుచేసుకుంది.

ముంబై నగరానికి చెందిన నాంగేంద్ర కుమార్ కార్తీక్ మెహతా(42) మానస సరోవర యాత్రకు వెళ్లాడు. అయితే ఇతడు నేపాల్ లోని హిల్సా ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదారనికి గురయ్యాడు. హెలికాప్టర్ ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు దాని రెక్కలు తగిలి అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ అధికారులు నాగేంద్ర మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిమ్ కోట్ ఆస్పత్రికి తరలించారు. నాగేంద్ర మృతిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
 

Last Updated 9, Sep 2018, 11:32 AM IST