చైనాలో భారీ అగ్నిప్రమాదం..36 మంది సజీవ దహనం.. పలువురి పరిస్థితి విషమం

By Rajesh KarampooriFirst Published Nov 22, 2022, 8:59 AM IST
Highlights

చైనా వర్క్‌షాప్ లో భారీ అగ్నిప్రమాదం: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ  అగ్ని ప్రమాదంలో సుమారు 36 మంది మరణించారు. అన్యాంగ్ నగరంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు చైనా మీడియా సమాచారం ఇచ్చింది. అగ్నిప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా, ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది.

చైనా వర్క్‌షాప్ లో భారీ అగ్నిప్రమాదం:  మంగళవారం ఉదయాన్నే చైనా నుంచి ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది.సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాదాపు 36 మంది సజీవదహనమయ్యారు.అన్యాంగ్‌ నగరంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు గల్లంతైనట్లు సమాచారం.  

 చైనా మీడియా ప్రకారం.. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సహాయక సిబ్బంది, 60 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అన్యాంగ్ సిటీలోని హైటెక్ జోన్ వెన్‌ఫెంగ్ జిల్లాలోని కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.

అగ్నిమాపక దళం బృందాలు 63 వాహనాలను సంఘటనా స్థలానికి పంపించాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చి రాత్రి 11 గంటలకు పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, ఇద్దరు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

2015లో ప్రమాదకరమైన పేలుడు

మార్చి 2019లో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 78 మంది మరణించారు. కిలోమీటర్ పరిధిలోని ఇళ్లను ధ్వంసం చేశారు. అలాగే.. 2015లో ఉత్తర టియాంజిన్‌లోని ఒక రసాయనాల గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 165 మంది మరణించారు. చైనాలో సంభవించిన ఘోర ప్రమాదాల్లో ఒకటి.

click me!