సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 35మంది మృతి

Published : Oct 17, 2019, 09:20 AM ISTUpdated : Oct 17, 2019, 10:25 AM IST
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 35మంది మృతి

సారాంశం

మక్కా మసీదు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా... ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35మంది విదేశీయులు మృతి చెందారు.  

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా ప్రావిన్స్ లోని అల్ అఖల్ సెంటర్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు... భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. మక్కా మసీదు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా... ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35మంది విదేశీయులు మృతి చెందారు.

కాగా... పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అల్ హమ్నా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్, అరబిక్ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా... ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు